వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భార్యతో బలవంతపు శృంగారాన్ని రేప్‌గా పరిగణించలేం’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'మెరిటల్ రేప్' విషయంపై ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తన వాదనను తెలిపింది. భార్యతో భర్త బలవంతపు శృంగారం.. అత్యాచారం కిందికి రాదని కేంద్రప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 375లో ఉన్న రెండో మినహాయింపును కేంద్రం సమర్థిస్తూ తన వాదనలు వినిపించింది. దేశంలో ఉన్న సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే భార్యభర్తల సంబంధాల దృష్ట్యా ఈ మినహాయింపు ఉందని పేర్కొంది.

inercorse

15ఏళ్లపైబడిన భార్యపై భర్త జరిపే బలవంతపు శృంగారం(లైంగికదాడి).. అత్యాచారం కిందికి రాదంటూ ఈ నిబంధన పేర్కొంటున్న విషయాన్ని కేంద్రం గుర్తుచేసింది.

ఐపీసీ సెక్షన్ 375ను సవాల్ చేస్తూ ఒక స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై సోమవారం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట కేంద్రం ఈ వాదనలు వినిపించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా భార్యతో బలవంతపు శృంగారం అత్యాచారం కిందికి రాదని తన తీర్పులో పేర్కొన్న విషయం తెలిసిందే.

English summary
The Centre on Monday told the Delhi high court that if marital rape is brought under law, “the entire family system will be under great stress” and defended the penal code provision that protects husbands from being tried for the rape of their wives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X