Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో .. రోడ్లమీదికొచ్చిన మొసళ్లు.. ఎక్కడో తెలుసా..? (వీడియో)

వడోదర : ఉక్కపోతతో అల్లాడిన జనానికి వాతావరణ మారడంతో ఉపశమనం కలిగింది. వర్షాలు కురవడంతో అన్నదాత ఊరట పొందాడు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా వర్షాలు పడుతుంటే .. గుజరాత్, అసోంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాలంటే సాధారణ వర్షాలు కాదు .. నగరాల్లో వీధులు వర్షపునీటితో నిండిపోయాయి. అయితే వర్షపునీటితో మొసళ్లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు కాపాలాగా కుక్కలను వెంట పెట్టుకొని ఉంటున్నారు. మరికొందరు బిక్కు బిక్కుమంటూ దేవుడా అంటూ నిట్టూరుస్తున్నారు.

వడోదరలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికతో స్కూళ్లు, కాలేజీలకు గుజరాత్ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. వడోదర గల్లీల్లో వరదనీటితో నిండిపోయాయి. దీంతో ఆ నీటిలో మొసళ్లు కనిపించడం భయభ్రాంతులకు గురిచేస్తోంది. మొసలి కనిపించిన దృశ్యాలను నెటిజన్లు తీసి సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. మొసళ్ల భయంతో కొందరు తమ ఇంటి గేట్ల వద్ద కాపాలాగా శునకాలను పెట్టుకున్నారు. అయితే అందులో ఒక మొసలి కుక్కపై దాడి చేసేందుకు వచ్చింది. బెదిరిపోయిన ఇంటి యాజమానులు తమ ఇంటి ముందు శునకాలను కాపాలాగా పెట్టుకున్నారు.

crocodiles are vadodara streets

ట్విట్టర్‌లో ఆ వీడియోకు నెటిజన్ 'వడోదరరెయిన్స్' అని కాప్షన్ జత చేశారు. అందులో మొసలి వస్తోన్న తీరు ..దాని నుంచి తప్పించుకునేందుకు రెండు శునకాలు పడుతున్న పాట్లను వివరించారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కుక్కలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉన్నాయని పేర్కొన్నారు. దీంతోపాటు శైలేంద్ర మోహన్ అనే నెటిజన్ అకోటలో వరద బీభత్సం గురించి వీడియో ట్వీట్ చేశారు. అందులో మొసళి వీధుల్లో తిరుగతూ భయాందోళనను కలిగించింది. ప్రస్తుతం గుజరాత్ వీధుల్లో మొసళ్లు తిరుగుతున్నాయని .. నెటిజన్లు వణుకుతూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వడోదరలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బుధవారమే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+