Maha kumbh mela 2025: 10 కోట్లు మంది పుణ్య స్నానాలు.. మౌని అమావాస్య ఎఫెక్ట్..!

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న ఆధ్యాత్మిక క్రతువు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం వరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక గణాంకాలను ఎక్స్ వేదికగా వెల్లడించింది. " మహా కుంభమేళాలో 10కోట్లమందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. గతంలో కంటే ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంతో భక్తిపారవశ్యంగా, గ్రాండ్ గా ఉంది." అని ఎక్స్ వేదికగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

మౌని అమావాస్య ఎఫెక్ట్..

జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా మరో 10 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మౌని అమావాస్య సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని యూపీ ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా 150 రైళ్లను అదనంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే ..పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్యను సర్వేషాం అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు. మౌని అమావాస్య రోజు పుణ్యస్నానం చేసి, పితృతర్పణాలు విడిస్తే దోషాలు పోతాయని, విశేష పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.

Crowd at Maha Kumbh Mela Grows as Over 10 Crore Devotees Take Holy Dip

రష్యా, ఉక్రెయిన్ నుంచి భక్తులు..

గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఈ రెండు దేశాల సైన్యాలు భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మహా కుంభమేళాకు రష్యా, ఉక్రెయిన్ నుంచి కూడా భక్తులు వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమ దేశాలు వేరైనా ఆధ్యాత్మికంగా ఒకటేనని చాటిచెప్పుతున్నారు. గడ్డకట్టే చలిలోనూ స్నానాలు చేసి హరేరామ్ హరేకృష్ణ అంటూ పాటలు పాడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ' ఇలా అన్ని దేశాల ప్రజలు ఒకే దగ్గర చేరడం చరిత్రాత్మక విషయం. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. మేము సాధువులుగా ఇక్కడకు వచ్చాం. మేము సనాతన ధర్మాన్ని అనుసరిస్తాం' అని ఓ భక్తురాలు తెలిపారు.

ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆయన వెంట కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పూజలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+