కూతురు డేటింగ్ చేస్తోందని జడ పట్టి, రోడ్డుపైకి లాక్కొచ్చి కొట్టిన తండ్రి!
బెంగళూరు: ఓ తండ్రి తన కూతురును ఇష్టారీతిగా కొడుతుండగా.. దాదాపు యాభై మంది వరకు ప్రజలు అలాగే చూస్తూ ఉండిపోయిన ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఇరవయ్యేళ్ల యువతిని పోలీసు అధికారిగా పని చేస్తున్న వ్యక్తి చితకబాదాడు. అందుకు ఆమె ఎవరితోనే డేటింగ్ చేస్తున్నదనే అనుమానమే కారణమని తెలుస్తోంది.
ఈ సంఘటన ఈస్ట్ బెంగళూరులో జరిగింది. ఆ తండ్రి తన కూతురు వెంట్రకలు పట్టుకొని లాక్కొచ్చి, ఆమెను దారుణంగా కొట్టాడు. అదే పనిగా ఆమె పైన చేయి చేసుకున్నాడు. అతని పేరు రాజారాంగా తెలుస్తోంది. అతను సబ్ ఇన్సుపెక్టర్‌గా పని చేస్తున్నారని సమాచారం. తన కూతురు ఎవరితోనే డేటింగ్ చేస్తోందని ఆ చెవిన, ఈ చెవిన విన్నారు.

దీంతో ఆగ్రహంతో అతను తన కూతురు జడ పట్టుకు రోడ్డు పైకి లాక్కొచ్చి శిక్షించాడు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఆ కూతురు తల్లి పక్కనే ఉంది. ఆమె ఉపాధ్యాయురాలు. ఆమె పక్కనే మౌనంగా నిలబడ్డారు. తల్లితో పాటు మరికొంతమంది... అంటే దాదాపు యాభై మంది వరకు గుమికూడారు. ఎవరు కూడా ఆపేందుకు రాలేదు.
ఆ తర్వాత ఇద్దరు ప్రయివేటు మహిళా ఉద్యోగులు.. తండ్రి నుండి ఆమెను తప్పించి తమ కారులో తీసుకు వెళ్లారు. ఆమెను రక్షించిన వారి పేర్లు నివేదిత, అర్చనగా తెలుస్తోంది. వారు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఫలహారం తీసుకునేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వెంటనే కారు ఆపి ఆమెను రక్షించారు.












Click it and Unblock the Notifications