సీఆర్‌పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియో
ఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలోనే జమ్ము,కశ్మీర్‌లో కురుస్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
దీంతో జమ్ము కశ్మీర్ బారాముల్లా జిల్లాలో తంగ్‌మార్గ్ పట్టణంలో కురిసిన వర్షాలకు ఓ యువతి నదిలో కొట్టుకుపోయింది..దీంతో మహిళ నదిలో కొట్టుకుపోతున్న మహిళను పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గమనించారు.. దీంతో వరదలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడేందుకు అయిదుగురు జవాన్లు నదివెంట పరుగులు తీశారు... మహిళకు అడ్డంగా పరుగులు పెట్టిన ఇద్దరు జవాన్లు నదిలోకి దూకారు. కొట్టుకుపోతున్న మహిళను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా 176 బ్యాచ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవానులు నదివెంట పరుగులు పెడుతూ పారుతున్న నదిలో దూకి మహిళను కాపాడిన వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది..
#WATCH CRPF personnel saved a girl from drowning in Baramulla, Jammu and Kashmir, earlier today. pic.twitter.com/bORwRla6vV
— ANI (@ANI) July 15, 2019












Click it and Unblock the Notifications