జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాల తనిఖీ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల జరిపారు. నాకా వద్ద విధి నిర్వహణలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు చోటు చేసుకన్నాయి. బైక్ పై వచ్చిన ఇద్దరు సాయుధులు ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

కుల్గామ్ జిల్లాలో అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతమైన అఖ్రాన్ లో గల నాకా పాయింట్ వద్ద మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో జవాన్లు ఎప్పట్లాగే వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు సీఆర్‌పీఎఫ్ జవాన్ల బృందంపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పరారయ్యారు.

CRPF personnel were injured after unidentified assailants opened fire in Kulgam of Jammu and Kashmir

దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని అనంతనాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాల్పుల శబ్దం వినపడగానే అఖ్రాన్ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. దాడి సమాచారం అందుకున్న వెంటనే అదనపు భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.

పారిపోయిన దుండగులను గుర్తించడానికి సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పరిసర ప్రాంతాలలో విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనుమానాస్పద కదలికలను కనిపెట్టేందుకు ప్రధాన రహదారులతో పాటు అంతర్గత మార్గాలను జల్లెడ పడుతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రతను మరింత పెంచి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో చేర్పించిన జవాన్లకు వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడి నేపథ్యంలో కుల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోన్నారు. కేంద్ర హోమ్, రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ ఘటనపై ఆరా తీస్తోన్నాయి. సమాచారాన్ని తెప్పించుకుంటోన్నాయి. గాయపడ్డ జవాన్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటోన్నాయి. అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ ఘటనపై చురుగ్గా స్పందించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను సంఘటన స్థలానికి తరలించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+