వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీలను చంపేస్తామని బెదిరింపు మెయిల్

|
Google Oneindia TeluguNews

హోంమంత్రి అమిత్ షా , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తామని బెదిరించే ఇ-మెయిల్ మంగళవారం ఉదయం ముంబైలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) కు వచ్చిందని సమాచారం.
నివేదికల ప్రకారం, ప్రార్థనా స్థలాలు మరియు ముఖ్యమైన ప్రదేశాలపై కూడా దాడులు చేస్తామని మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు ఆగంతకులు.

 తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు... తనిఖీలు చేపట్టిన పోలీసులు .. అసలేం జరిగిందంటే తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు... తనిఖీలు చేపట్టిన పోలీసులు .. అసలేం జరిగిందంటే

11 ఆత్మాహుతి దళాలు గా దాడులకు దిగుతామని మెయిల్ ద్వారా హెచ్చరిక

11 ఆత్మాహుతి దళాలు గా దాడులకు దిగుతామని మెయిల్ ద్వారా హెచ్చరిక

ఆత్మాహుతి దాడుల ద్వారా యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను హతమారుస్తామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించినట్టు సమాచారం. వారు 11 ఆత్మాహుతి దళాలు గా దాడులకు దిగుతామని మెయిల్ ద్వారా పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి కీలక బీజేపీ నేతలను హతమారుస్తాం అంటూ వచ్చిన ఈ మెయిల్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ చేయలేదు

ఈ ఏడాది జనవరిలో యోగీని చంపేస్తామని బెదిరింపు కాల్ . మైనర్ అరెస్ట్

ఈ ఏడాది జనవరిలో యోగీని చంపేస్తామని బెదిరింపు కాల్ . మైనర్ అరెస్ట్

ఇక ఈ ఏడాది జనవరిలో యుపి పోలీసు అత్యవసర సేవ 'డయల్ 112' కు యోగి ఆదిత్యనాథ్‌ను 24 గంటల్లో ఎకె -47 రైఫిల్‌తో చంపేస్తానని బెదిరిస్తూ ఒక సందేశం వచ్చింది. అయితే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరిస్తూ వాట్సాప్‌లో డయల్ 112 సేవకు కాల్ చేసి చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అప్పుడు ఆగ్రాకు చెందిన మైనర్‌ను అరెస్టు చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది .

 గతంలో మోడీని చంపేస్తామని పలు మార్లు బెదిరింపులు

గతంలో మోడీని చంపేస్తామని పలు మార్లు బెదిరింపులు

ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు గత ఏడాది ఈమెయిల్ రావడం కలకలం రేపింది. మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్ఏఐ హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసింది . ఓ మెయిల్ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్ఐఏ.. వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీకి చెబుతున్నట్లుగా నోయిడాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా డయల్ 100 కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.

అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్ లకు భద్రత కట్టుదిట్టం

అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్ లకు భద్రత కట్టుదిట్టం

దీంతో అలర్ట్ అయిన నోయిడా ఫేజ్ 3 పోలీసులు కాల్ లొకేషన్ ట్రేస్ చేసి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, హోంమంత్రి అమిత్ షా లను చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో వారిరువురి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్ పంపించిన వ్యక్తి కోసం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి బెదిరింపు వ్యవహారాలను అంత ఈజీగా తీసుకోలేమని అధికారులు మాత్రం తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు .

English summary
The CRPF in Mumbai received a threat mail few days ago naming Home Minister Amit Shah and Uttar Pradesh Chief Minister Yogi Adityanath, news agency ANI quoted CRPF sources as saying, who added that the concerned agencies have been informed. According to reports, the mail has threatened to kill Shah and Adityanath and also carry out attacks at places of worship and important installations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X