స్వాతంత్ర దినోత్సవ వేడుకలు: బాంబులు వేశారు
పాట్నా: బీహార్ లో దుండగులు బరితెగించారు. దేశ భక్తిని చాటుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉన్న చిన్న పిల్లలను చంపేయ్యడానికి ప్లాన్ వేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న స్కూల్ లోకి నాటు బాంబు విసిరేశారు. అయితే ఈ బాంబు పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బీహార్ లోని నావదా జిల్లా కేంద్రంలో సెంట్ జోసెఫ్ స్కూల్ ఉంది. శనివారం ఉదయం స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గోన్నారు. పిల్లలు అందరూ సాంసృతిక కార్యక్రమాలలో నిమగ్నం అయ్యారు.

స్కూల్ టీచర్లు, సిబ్బంది, పిల్లల కుటుంబ సభ్యులు సాంసృతిక కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు స్కూల్ ఆవరణంలోకి రెండు నాటు బాంబులు విసిరేశారు. బాంబులు పేలడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలైనాయి.
పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై చెల్లాచెదురు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలను ఆసుపత్రికి తరలించారు. స్కూల్ పరిసర ప్రాంతాలలో ఎర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications