పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గు?- కేంద్రం ఏం చెబుతోంది?

Petrol and Diesel Price: మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణ ప్రభావం.. క్రూడాయిల్ పై తీవ్రంగా పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా పెరిగింది. అమాంతం ఏడు శాతాన్ని దాటిపోయింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు పెరుగుబాట పట్టొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో భగ్గుమంటోన్నాయి మధ్య- తూర్పు దేశాలు. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. తాజాగా ఇజ్రాయెల్.. ఇరాన్ పై దండెత్తింది. Raising Lion అని పేరుతో ముమ్మర దాడులు కొనసాగిస్తోంది.

Crude oil prices have surged sharply as Israel Iran conflict

ఈ దాడుల్లో- అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మరణించినట్లు తెలుస్తోంది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా దుర్మరణం పాలైనట్లు టస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది టస్మిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

దీనికి ప్రతీకారానికి దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ నగరాలపై భారీగా బాలిస్టిక్ మిస్సైళ్లను సంధించింది. దాదాపుగా 200కి పైగా క్షిపణులను ప్రయోగించింది. అర్ధరాత్రి నుంచి రెండు విడతల్లో ఈ దాడి సాగింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలు.. టెల్ అవివ్, జెరూసలేం సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులకు దిగింది.

ఈ యుద్ధ ప్రభావం క్రూడాయిల్ పై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర 7.35 శాతానికి పెరిగింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 74.23 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర 73.18 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఇక్కడ 7.55 శాతం మేర పెరుగుదల కనిపించింది.

శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ రేటు భారీగా పెరిగింది. బ్యారెల్ ఒక్కిటింకి నాలుగు నుంచి అయిదు డాలర్ల మేర ఈ పెరుగుదల రికార్డయింది. చమురు కంపెనీలపై మరింత భారం పెరిగినట్టయింది. దీన్ని వాహనదారులకు బదలాయించే అవకాశాలు లేకపోలేదు.

ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎటువంటి మార్పూ లేదు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.94.77 పైసలు, డీజిల్ రూ.87.67 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ రూ.103.50, డీజిల్ రూ.90.03 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.105.41 పైసలు, డీజిల్ రూ.92.02 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.100.82 పైసలు, డీజిల్ 92.40 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.102.92 పైసలు, డీజిల్ రూ.90.99 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.94.68 పైసలు, డీజిల్ 87.80 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.108.45 పైసలు, డీజిల్ 96.22 పైసలుగా రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+