నమ్మండి ఇది నిజమే: భారీ అపార్ట్‌మెంట్‌పై నుంచి వాటర్ ఫాల్స్!(వీడియో)
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ముంబై రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా ఉండాలూ ముంబై ప్రజలను అప్రమత్తం చేశారు నగర పోలీసు విభాగం.
ఇది ఇలా ఉండగా, తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ఆకట్టుకుంటోంది. భారీ వర్షాలతో ఓ అపార్ట్ మెంటుపై నుంచి ధారాళంగా పడుతున్న వర్షపు నీరు.. ఒక ఎత్తైన జలపాతంగా కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.

ఈ జలపాతం వీడియోను కే సుదర్శన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో.. 'న్యూ కఫీ పరేడ్‌లో వాటర్ ఫాల్స్ #ముంబై రెయిన్స్'అనే హాష్‌ట్యాగ్‌తో పోస్టు చేశారు. న్యూ కుఫ్ఫే పరేడ్ అపార్ట్ మెంట్ నుంచి పడుతున్న వర్షపు నీరు ఇదొక వాటర్ ఫాల్స్ అన్నట్లు అనిపిస్తోంది.
Waterfalls in New Cuffe Parade! #MumbaiRains pic.twitter.com/eqPQhGf73V
— K Sudarshan (@SudarshanEMA) September 4, 2019
అతను సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేసిన గంటలోనే 3వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. లైక్స్, రీట్వీట్లు వచ్చాయి. కొందరు నెటిజన్లు నమ్మకపోవడంతో.. ఇది నిజంగానే ఆ అపార్ట్‌మెంట్‌పైనుంచి పడుతున్న వర్షపు నీరే అని సుదర్శన్ సమాధానం ఇచ్చారు. కాగా, మరో రెండ్రోజులపాటు ముంబైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ వాతావరణ శాఖ నగరవాసులను అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications