రిలాక్స్: బెంగళూరులో కర్ఫ్యూ ఎత్తివేశారు
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ బెంగళూరులో చేసిన ఆందోళనలతో అట్టుడికిన 16 ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను ఎత్తివేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరిక్ తెలిపారు.

బెంగళూరు నగరంలోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం రాత్రి 11.30 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు. ఆపరిసర ప్రాంతాల్లో పోలీసులు డేగకన్ను వేశారు. అయితే మంగళవారం కర్ఫ్యూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి.
#Curfew has been lifted in all 16 police station limits of Bengaluru City from 9AM today
— N S Megharikh IPS (@CPBlr) September 14, 2016
పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో బుధవారం కర్ఫ్యూ ఎత్తివేస్తున్నామని బెంగళూరు నగర పోలీసులు తెలిపారు. కర్ఫ్యూ ఎత్తివేయడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో అధిక సంఖ్యలో పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.












Click it and Unblock the Notifications