బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ఫూను లెక్కచెయ్యం: షాపులకు నిప్పంటించారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కావేరి జలాల కోసం తాము ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని కన్నడ సంఘాల కార్యకర్తలు అంటున్నారు. బెంగళూరు నగరంలోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫూ అమలులో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇక్కడి హెగ్గనహళ్ళిలో పలువురు కన్నడ సంఘాల కార్యకర్తలు పోలీసుల ఆదేశాలు (కర్ఫూ) ఎదిరించి మంగళవారం రోడ్ల మీదకు వచ్చారు. తమిళ ప్రజలకు చెందిన హోటళ్లు, షాప్ లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు.

Curfew has no impact in Hegganahalli in Bengaluru

కనిపిస్తే కాల్చివేస్తాం అని పోలీసులు హెచ్చరించినా వారు లెక్కచెయ్యలేదు. పోలీసులు లాఠీచార్జ్ చేసి 30 మంది ఆందోళనాకారులను అరెస్టు చేశారు. అగ్నిమాపక సిబ్బంది నిప్పంటుకున్న షాప్ దగ్గరకు చేరుకుని మంటలు అదుపుచేశారు.

కర్ఫూ అమల్లో ఉందని పోలీసు అధికారులు పదేపదే హెచ్చరించినా ఆందోళనకారులు లెక్కచెయ్యకపోవడంతో పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవలు ఎంతటికి దారితీస్తాయో అని బెంగళూరు ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Curfew has no impact in Hegganahalli. People continue to protest. 30 persons have been arrested in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X