సల్మాన్ ఖాన్ సినిమా, గొడవలు, కర్ఫ్యూ
జంషెడ్ పూర్: ఇరు వర్గాల మద్య గొడవలు జరిగి అల్లర్లు చెలరేగడంతో జంషెడ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడ్డాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు కర్ఫ్యూ విదించారు. ఎవరైనా బయటకు వస్తే కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా కర్ఫ్యూను కొనసాగిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ప్రధాన్ తెలిపారు.
బుధవారం బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ జంషెడ్ పూర్ బంద్ కు పిలుపునిచ్చిన నేపద్యంలో అల్లర్లు చెలరేగాయి.
బంద్ కు పిలుపునిచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్బంలో వారి మద్య వాగ్వివాదం జరిగింది. తరువాత పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాలకు నిప్పంటించారు. అనేక షాప్ లు ద్వంసం చేశారు.

ఇరు వర్గాలకు చెందిన 30 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించారు. పోలీసులకు గాయాలైనాయి. పోలీసులు కర్ఫ్యూ విదించారు. అల్లర్లు ఎక్కవగా ఉన్న ప్రాంతంలో 15 పారా మిలటరి దళాలు, సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. 103 మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.
సోమవాం రాత్రి మ్యాంగో ఏరియాలో గొడవలు మొదలైనాయి. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ బాయిజాన్ చిత్రం చూసి ఇంటికి వెలుతున్న అమ్మాయిలను బైక్ లో వెళ్లిన కొందరు యువకులు అల్లరి చేశారని, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం చుట్టు పక్కల ప్రచారం చేశారు.
అమ్మాయిలను వేదించిన వారిని అరెస్టు చెయ్యాలని మంగళవారం ఒక వర్గం వారు ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తరువాత బుధవారం బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ బంద్ కు పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications