పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్. వరుడికి రూ.11 కట్నం,టీ తో సరిపెట్టారు

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం వివాహలపై పడుతోంది. ఈ ప్రభావం కారణంగా గ్రేటర్ నోయిడాలో సంజు, యోగేష్ విహహం సాదాసీదాగా జరిగింది. వరుడు యోగేష్ కు వధువు తరపు పెద్దలు పదకొండు రూపాయాలను కట్నంగా అందించారు. ఈ క

నోయిడా:పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం పెళ్ళిళ్ళపై పడుతోంది.కొందరు వివాహ ఖర్చులను తగ్గించుకొంటుండగా, మరికొందరు సాదాసీదాగా వివాహాలు చేసుకొంటున్నారు. మరికొందరైతే వివాహాలను వాయిదా వేసుకొంటున్నారు. అయితే నోయిడాలో మాత్రం పెద్ద నగదు నోట్ల ప్రభావంతో ఓ పెళ్ళి కొడుకు పదకొండు రూపాయాలను కట్నంగా తీసుకొని వివాహం చేసుకొన్నాడు.

గ్రేటర్ నోయిడాకు చెందిన మహవీర్ సింగ్ గ్యానో దంపతుల కుమార్తె సంజు వివాహం వరుడు యోగేష్ కు ఇచ్చి జరిపించారు. కేవలం పదకొండు రూపాయాలను కట్నం ఇచ్చి ఈ వివాహం జరిపించాడు వధువు తండ్రి. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా అల్లుడికి కేవలం పదకొండు రూపాయాలు మాత్రమే కట్నంగా అందింది.ఈ నగదును తీసుకొని వరుడు ఆనందంగా తన భార్యను తీసుకొని వెళ్ళాడు.

 currency ban effect on marrage in noida

మహవీర్ సింగ్ దంపతుల కుమార్తె సంజు వివాహం ఆదివారం రాత్రి జరిగింది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఎలాంటి ఆడంబరాలకు వెళ్ళకుండా సాదాసీదాగా వివాహం జరిపిస్తామని అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కుటుంబసభ్యులను కోరారు. అయితే ఈ ప్రతిపాదనకు అబ్బాయి తరపు కుటుంబసభ్యులు అంగీకరించారు.

ఈ వివాహనికి కొద్దిమంది అతిథులను మాత్రమే పిలిచారు. వారికి టీ మాత్రమే ఇచ్చారు. వధూవరులు దండలు మార్చుకొని పెళ్ళిచేసుకొన్నారు. పెళ్ళికి వచ్చిన వధువు తరపు పెద్దలు వరుడికి పదకొండు రూపాయాలను కట్నంగా వరుడికి ఇచ్చారు. ఈ కట్నం తీసుకొని వరుడు తన భార్యను తీసుకొని వెళ్ళాడు.ఈ వివాహనికి గ్రామస్థులు కూడ సహకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+