వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్ ,పెళ్ళి చేసేందుకు గ్రామస్థులంతా ఏకమయ్యారు

వివాహం జరిపించేందుకు గ్రామస్థులంతా ఏకమయ్యారు. తమ ఖాతాల్లో ఉన్న నగదును తోచినంతా డ్రా చేసి శంభాజీ కూతురు షాయాలీ వివాహనికి అందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోలాపూర్ : వంద అబద్దాలు ఆడైనా పెళ్ళి చేయాలి అనేది నానుడి. వివాహం కోసం ఎన్ని అబద్దాలు ఆడవచ్చనేది పాత కాలం రోజుల్లో పెద్దలు చెప్పేవారు. కాని, పశ్చిమబంగా రాష్ట్రంలో మాత్రం ఒక్క అమ్మాయి వివాహనికి గ్రామస్థులంతా ఏకమయ్యారు. తమకు తోచినరీతిలో డబ్బుసహయం చేసి పెళ్ళి జరిపించారు. పెద్ద నగదు నోట్ల రద్దుతో నిలిచిపోతుందనుకొన్న పెళ్ళిని గ్రామస్థులంతా కలిసి జరిపించారు.

పశ్చిమబంగా రాష్ట్రంలోని కోలాపూర్ కు సమీపంలోని యాలగంద్ గ్రామానికి చెందిన సాయాలీ ఉన్నత విద్యను పూర్తిచేసింది. ఆమెకు స్థానికంగా ఉన్న కరద్ అనే దుకాణయజమానికితో మూడు మాసాల క్రితం వివాహం నిశ్చయమైంది. నవంబర్ 22వ, తేది 2016 న, వివాహం జరిపించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకొన్నారు.

currency ban effect on marriage

ఈ పెళ్ళికి అనుకోని అవాంతరం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయం ఈ వివాహంపై పడింది. ఈ వివాహం నిలిచిపోతోందని భావించారు.అయితే ఈ వివాహం నిలిచిపోకుండా గ్రామస్థులు సహకారం అ:దించారు. వివాహం జరిగేలా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో సహకారం అందించారు.

కోలాపూర్ లోని బ్యాంకులో అకౌంట్ లో డబ్బున్న ప్రతి ఒక్కరూ బ్యాంకు వద్ద బారులు తీరారు. తమ అకౌంట్ లో ఉన్న నగదును డ్రా చేసి సాయాలీ తండ్రి శంభాజీకి అందజేశారు. నిలిచిపోతోందని భావించిన వివాహం గ్రామస్థుల సహకారంతో నిర్విఘ్నంగా ముగిసింది. గ్రామస్థుల సహకారం వల్లే తన కూతురు వివాహం జరిగిందని శంభాజీ ఆనందంతో చెబుతున్నారు. ఒక మంచి కార్యానికి తమకు తోచిన సహయం చేశామని గ్రామస్థులు చెప్పారు.

English summary
currency ban effect on marrage in west banga state. shambaji native of kolapur village in banga state. his dauther sayali marrage fix shop owner karad before six months.currency ban effect on this marrage. villagers went to kolapur branch draw some amount given to shambaji. who has helping to him shabhaji thaks to everyone .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X