Karnataka Elections 2023: 8 మంది మాజీ సీఎంలతో రికార్డ్ సృష్టించిన కర్ణాటక..

1972 నుంచి 2023 వరకు కర్ణాటకలో 18 మంది సీఎంలు పని చేశారు. వీరిలో 8 మంది మాజీ సీఎంలు ఇప్పటికీ బతికి ఉండడం అరుదైన ఘనత అని చెప్పుకోవచ్చు. వీరప్ప మొయిలీ, దేవగౌడ, ఎస్ఎం కృష్ణ, సదానంద గౌడ, జగదీష్ షెట్టారు, సిద్ధరామయ్య, కుమారస్వామి, యడియూరప్ప ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నారు. అయితే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంది మాజీ సీఎంలు జీవించి లేరు. ప్రస్తుతం కర్ణాటక అపదర్మ సీఎంగా బసవరాజ్ బొమ్మై ఉన్నారు.

కాగా బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఇందులో మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభిస్తుందని పేర్కొన్నాయి. ఒకటి రెండు సంస్ధలు మాత్రం బీజేపీకి ఆధిక్యం లభిస్తుందని అంచనా వేశాయి. తద్వారా మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదనే అంచనాకు వచ్చాయి.

 bjp-congress-jds

రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఇండియా టీవీ, జీ న్యూస్, ఏబీపీ, టీవీ 9, టైమ్స్ నౌ వంటి ఛానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం దక్కింది. వీటితో పాటు జన్ కీ బాత్, సీ ఓటర్, సువర్ణ న్యూస్, టుడేస్ చాణక్య, ఆత్మసాక్షి వంటి సర్వే సంస్ధల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో ఆధిక్యం లభించే అవకాశం ఉంది.

కర్ణాటక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. ఈసారి బీజేపీ సంపూర్ణ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల ముగిసి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న సమయంలోనే జేడీఎస్ నేత, మరో మాజీ సీఎం కుమారస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ధన రాజకీయాలకు తాము తట్టుకోలేకపోయామని, కేవలం డబ్బు లేని కారణంగానే 25 సీట్లలో గెలవలేకపోతున్నట్లు కుమారస్వామి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+