Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జొమాటోకు వింత అనుభవం..! డెలివరీ బాయ్ తమ మతం వాడు కాదని ఫుడ్ తిరస్కరణ..!!

Recommended Video

    వేరే మతం వాడని ఫుడ్ తిరస్కరణ..!! : Customer Refuses To Take Order From 'Non-Hindu' Delivery Guy

    న్యూఢిల్లీ : కుల, మతాల జాఢ్యం పీక్ స్టేజీకి చేరిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మారుమూల ప్రాంతంలో కులం, మతాలు పట్టింపులు ఇంకా ఉండగా .. పట్టణాలు, నగరాల్లో వివిధ పేర్లతో చిన్నచూపు కలవరపెడుతుంది. మెట్రో నగరాల్లో .. ఐటీ చదువులు చదువుతున్న యువత కూడా కుల, మతాల పట్టించుకోవడం చర్చానీయాంశమైంది. అదీ కూడా ఫుడ్ డెలివరీ జొమాటో యాప్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. కానీ దీనికి జొమాటో ధీటుగా స్పందించింది. తాము కుల, మతాలను పట్టించుకోమని తేల్చిచెప్పింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. జొమాటోకు జోహర్లు అని ట్వీట్ చేశారు.

    కుల జాఢ్యం

    మెట్రో నగరాల్లో జొమాటో, స్విగ్గి ఇతర సంస్థలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. కస్టమర్ల ఆకలి తీరుస్తున్న ఆ సంస్థలు ఆదాయం కూడా గడిస్తున్నాయి. అయితే ఇటీవల అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ డెలివరీ చేశాడు. ఆయన చేసిన ఆహారం సమయానికి వచ్చింది. అయితే ఆకలితో ఉన్న ఆ ఫుడ్ తీసుకోవాల్సిన శుక్లాకు మతం అడ్డొచ్చింది. డెలివరీ బాయ్ తమ మతం కాదని వింత కారణం చెప్పాడు. అంతేకాదు తాను చేసిన ఘనకార్యాన్ని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి జొమాటో తీవ్రంగానే స్పందించింది. తమకు కుల, మత పట్టింపులు లేవని స్పష్టంచేసింది. మీకు ఆహారం వద్దంటే క్యాన్సిల్ చేయండి, రీ ఫండ్ మాత్రం ఇవ్వబోమని తేల్చిచెప్పింది. మత ఛాందసవాది అయిన శుక్లా ఆర్డర్ క్యాన్సిల్ చేసి .. తన మత మౌఢ్యాన్ని నిరూపించుకున్నాడు. తనకు రీ ఫండ్ కూడా వద్దని చెప్తూ తాను బుక్ చేసిన ఆహారాన్ని తీసుకోకుండా క్యాన్సిల్ చేశాడు.

    కుల,మతాలు లేవు

    దీనిపై జొమాటో స్పందిస్తూ .. ఆహారానికి మతం లేదని, మీకు తెలిసి కుల, మతాలు ఉన్నాయా అని శుక్లాను ప్రశ్నించింది. అంతేకాదు జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ జోయల్ కూడా రియాక్టరయ్యారు. ‘మేం భారతదేశ వారసత్వ సంపదకు వారసులైనందుకు గర్వంగా భావిస్తున్నాం, అంతేకాదు తమ వినియోగదారులు, భాగస్వాముల సహకారంతో జొమాటో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా తమ వ్యాపార సంస్థను పెంచుకునేందుకు మాత్రం విలువలకు కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో విలువలకు తిలోదకాలివ్వం.. తమ వ్యాపారంలో నష్టమొచ్చినా ఫరావాలేదు‘ అని ట్వీట్ చేశారు. హిందుయేతర డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహారాన్ని శుక్లా నిరాకరించడంతో ఈ మేరకు ఘాటుగా స్పందించారు గోయల్.

    బ్లాక్ చేయండి

    బ్లాక్ చేయండి

    మరోవైపు జొమాటో రియక్షన్‌ను నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘ఆహారానికి మతం ఉండదనే జొమాటో సమాధానాన్ని నెటిజన్లు కొనియాడారు. ఇది మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతుందని .. అందరూ సమానమనే దేశ విధానాలకు సజీవ సాక్ష్యమని ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా జొమాటో ధీటుగా స్పందించడంపై మరో నెటిజన్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు అలాంటి వినియోగదారులను బ్లాక్ చేయాలని సూచించారు. దీంతో ఇతరులకు కూడా భయం ఏర్పడుతుందుని .. వారి విధానాలను కూడా మార్చుకుంటారని పేర్కొన్నారు. ఆహార ప్రియులకు కుల, మతా జాఢ్యం ఉండదని .. దీనిపై ధీటుగా స్పందించిన జొమాటోకు వందనం అని నెటిజన్లు కొనియాడారు. జొమాటో చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ ట్రోలవుతుంది. ఇప్పటికే 800 మంది రీ ట్వీట్ చేయగా .. 15 వేల మంది లైక్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+