అమల్లోకి పెట్రోల్, డీజిల్ డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకునే వారికి 0.75 శాతం రాయితీ ఇస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీ ప్రకటించింది.
డెబిట్, క్రెడిట్ కార్డుల, ఈ-వాలెట్లు లేదా మొబైల్ వాలెట్లు ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. లీటరు పెట్రోల్ పై 49 పైసలు, లీటరు డీజిల్ పై 41 పైసలు రాయితీగా ఇస్తున్నారు. కార్డు ద్వారా చెల్లించిన మూడు రోజుల తర్వాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 66.10, డీజిల్ ధర రూ.54.57గా ఉంది.

పాత పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు పూర్తైన సందర్భంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 8న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రోల్, డీజిల్ కొనుగోలుతోపాటు బీమా పాలసీలు, రైలు టికెట్లు, జాతీయ రహదారులపై టోలు ఛార్జీలు డిజిటల్ రూపంలో చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications