బంధువుల ఇంట్లో పని మనిషిపై కస్టమ్స్ అధికారి రేప్?

ఇరవై రోజుల క్రితం ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను విచారించిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు.
నిందితుడు తనను కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ భయం వల్ల ఎవరికీ చెప్పలేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలని కూడా తాము ప్రశ్నించామని, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించామని పోలీసులు చెప్పారు.
25 ఏళ్ల ఆ బాధితురాలి పైన అతను పద్దెనిమిది నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడట. అతని వయస్సు 47. బాధితురాలు శనివారం ఘజియాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కాగా, తన మేనత్తను సరిగా చూసుకోనందుకు ఆమెను పనిలో నుండి తొలగించామని, అందుకే తనపై అత్యాచార ఆరోపణలు చేస్తోందని సుశీల్ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications