సిడబ్ల్యూసి సభ్యుల రిజైన్? ప్రతిపక్ష నేతగా రాహుల్ నో
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సిడబ్ల్యూసి, ఏఐసిసి భేటీ కానుంది. ఈ భేటీలో సిడబ్ల్యూసి సభ్యులు తమ రాజీనామాలను సమర్పించే అవకాశం ఉందంటున్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. ఎన్నికల్లో ఓటమికి సమిష్టి బాధ్యత వహించే దిశగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

ఓటమికి గల కారణాల పైన వారు చర్చించనున్నారు. రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించిన వారందరి పైనా వేటు వేయనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
మరోవైపు కాంగ్రెస్ ఘోర వైఫల్యం, బిజెపి అనూహ్య విజయం నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత రేసులో కమల్ నాథ్ ముందంజలో ఉన్నారని సమాచారం.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications