కన్నడ హీరో రాకింగ్ స్టార్ హత్యకు రౌడీషీటర్ కుట్ర ? బెంగళూరు పోలీసు అధికారుల క్లారిటీ!

బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో, రాకింగ్ స్టార్ యష్ హత్యకు బెంగళూరులో పేరుమోసిన రౌడీషీటర్ సైకిల్ రవి స్కెచ్ వేశాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంత కాలం నుంచి రాకింగ్ స్టార్ యష్ ను హత్య చెయ్యడానికి బెంగళూరుకు చెందిన మరో రౌడీషీటర్ కోదండరామతో సైకిల్ రవి చేతులు కలిపాడని సమాచారం.

రాకింగ్ స్టార్ యష్ హత్యకు కుట్ర జరుగుతోందని గురువారం జోరుగా ప్రచారం జరగడంతో సీనియర్ పోలీసు అధికారులు స్పందించారు. రాకింగ్ స్టార్ యష్ హత్యకు ఎలాంటి కుట్ర జరగలేదని, ఈ విషయంపై విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి సతీష్ కుమార్ గురువారం వివరణ ఇచ్చారు.

Cycle Ravi and his gang had allegedly plotting to murder Kannada actor Yash.

యష్ హత్యకు రెండు సంవత్సరాల క్రితం కుట్ర జరిగిందని, ఆ సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. రెండు సంవత్సరాల క్రితం యష్ మీద దాడి జరిగిందని ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు.

రౌడీషీటర్లు సైకిల్ రవి, కోదండరామ భద్దశత్రువులు. అయితే రాకింగ్ స్టార్ యష్ ను హత్య చెయ్యడానికి ఇద్దరూ చేతులు కలిపి బెంగళూరు నగర శివార్లలో మందు పార్టీ చేసుకున్నారని సమాచారం. స్యాండిల్ వుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులతో సైకిల్ రవికి పరిచయం ఉందని ప్రచారం జరుగుతుంది. చాల కాలం నుంచి తప్పించుకుని తిరుగుతున్న సైకిల్ రవిని ఇటీవలే బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+