బుల్‌బుల్ తుపాన్ ఎఫెక్ట్: 13 మంది మృతి, ఏడుగురు బెంగాల్ వాసులే.. దెబ్బతిన్న లక్ష ఇళ్లు..
బుల్ బుల్ తుపాన్ బెంగాల్, బంగ్లాదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల గాలులు వీయడంతో భారీ ఆన్తి నష్టం వాటిల్లింది. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోగా, భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. తుపాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ మిగిల్చిన గాయంతో తీరప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

13 మంది మృతి
బుల్ బుల్ తుపాన్ ధాటికి 13 మంది మృతిచెందారు. అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవడంతో మృతుల సంఖ్య తగ్గంది. మృతుల్లో ఆరుగురు బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. భారీ వృక్షాలు నేలకొరిగి వీరు మృతిచెందారు. అందులో పునరావాస కేంద్రంలో ఉన్న 52 ఏళ్ల మహిళ కూడా ఒకరు ఉన్నారు. వాస్తవానికి ఆమె ఇంటికి వెళ్తుండగా ప్రమాద రూపంలో కబలించింది.

30 మందికి గాయాలు..
మరొకరు 60 ఏళ్ల మత్య్సకారుడు అని అధికారులు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరిలించే సమయంలో వచ్చేందుకు అతను నిరాకరించారని, అందుకోసం వృక్షాలు నెలకొరగడంతో చనిపోయాడని తెలిపారు. తుపాన్ ప్రభావంతో 30 మంది గాయపడ్డారు. 6 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయాని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. మరోవైపు రెండు బోట్లు ఇంకా తిరిగి రాలేదని స్థానికులు చెప్తున్నారు. అందులో 36 మంది ఉన్నారని.. వారి ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో పెద్దగా తుపాన్ ప్రభావం చూపలేదని అధికారులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఎక్కువగా మయన్మార్ నుంచి వచ్చిన వారే ఉన్నారని తెలిపారు.

ఏడుగురు బెంగాల్ వాసులే..
తుపాన్ ప్రభావంతో భారత్‌లో ఏడుగురు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటి, బలహీన పడిందని భారత వాతావరణ విభాగ అధికారులు తెలిపారు. కానీ మత్స్యకారులు మరో 12 గంటలపాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఆ తర్వాతే చేపల వేటకు వెళ్లాలని స్పష్టంచేశారు.

మమత ఏరియల్ సర్వే
పశ్చిమబెంగాల్‌పై తుపాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఏడుగురు చనిపోగా.. దాదాపు లక్ష గృహలు దెబ్బతిన్నాయి. తుపాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం మమతా బెనర్జీ సోమవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని స్పస్టంచేశారు. మరోవైపు బెంగాల్‌కు బాసటగా నిలుస్తామని ప్రధాని మోడీ కూడా హామీనిచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications