ఏపీ, తెలంగాణల్లో సడన్‌గా రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీని ప్రభావం ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉండబోతోంది. ఉత్తరాంధ్ర సహా ఈ మూడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 520, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 610, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు ఆగ్నేయ దిశగా 610 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. బాలాసోర్ సమీపంలో గల ధర్మా పోర్ట్ వద్ద తీరాన్ని తాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
దీని ప్రభావం వల్ల బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి.
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 197 రైళ్లు రద్దయ్యాయి. తుఫాన్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
భారీ సంఖ్యలో రైళ్లు రద్దయిన కారణంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఏపీ, తెలంగాణల్లోని పలు రైల్వే స్టేషన్లల్లో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఇందులో భాగంగా 17 స్టేషన్లల్లో హెల్ప్ లైన్ కేంద్రాలను నెలకొల్పారు. వాటి నంబర్లను వెల్లడించారు.
హైదరాబాద్ (నాంపల్లి) 9063330400, సికింద్రాబాద్- 040-27786140, 040- 27786170, ఖాజీపేట్- 070-27782660, 0870- 2576430, ఖమ్మం- 7815955306, వరంగల్- 9063324898, సామర్లకోట- 088- 42327010, నెల్లూరు- 0861- 2345863, విజయవాడ- 0866- 2576924 నంబర్లతో హెల్ప్ లైన్లు ఏర్పాటయ్యాయి.
రాజమండ్రి- 0883- 2420541, అనకాపల్లి- 7569305669, ఏలూరు- 7569305268, గూడూరు- 08624- 250795, ఒంగోలు- 8592280306, తిరుపతి- 6302216220, రేణిగుంట- 9949198414, డోన్- 7815915535 నంబర్లతో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.












Click it and Unblock the Notifications