Cyclone Dana: ఒడిశాలో తీరం దాటనున్న దానా తుఫాను, భారీ వర్షాల అలర్ట్
Cyclone Dana: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను తీవ్రంగా మారింది. దానా ధాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్ సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. తీరాల్లో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున తుపాను తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

కాగా, ఒడిశాలోని పూరీ-సాగర్ దీపం మధ్య భితకర్కనికా-ధమ్రా సమీపంలో తుపాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి 3 లక్షల మందిని తరలించినట్లు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. మరో ఏడు లక్షల మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
#WATCH | Odisha: Strong winds and rainfall witnessed in Bhadrak's Dhamra as #CycloneDana is expected to make landfall over the Odisha-West Bengal coast, between October 24-25 pic.twitter.com/mCSVHBkZOT
— ANI (@ANI) October 24, 2024
ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సహా విపత్తు నిర్వహణ బృందాలను తుఫాను ప్రభావిత 14 జిల్లాల్లో మోహరించారు. పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను సహాయక బృందాలు తొలగిస్తున్నాయి. అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అక్టోబర్ 23 నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ ప్రభుత్వం వాయిదా వేసింది. అక్టోబర్ 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను కూడా వాయిదా వేశారు.
Puri beach Odisha...
— 🇮🇳Priya Mishra🇮🇳 (मोदी का परिवार) (@Priyaaa_B)
Mahaprabhu Jagannath Save Odisha and Kolkata .... Pray for us..🙏
Jai Jagannath Mahaprabhu 🙏🚩#CycloneInOdisha #CycloneDanaUpdate pic.twitter.com/G0QHJlJlxnమరోవైపు, పశ్చిమబెంగాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా తూర్పు, ఆగ్నేయ రైల్వేలు గురు, శుక్రవారాల్లో పలు రైళ్లను రద్దు చేశాయి. దానా తుఫాను ప్రభావంతో జార్ఖండ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొల్హాన్ ప్రాంతంలో శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాగా, దానా తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండనుంది. ఈ తుపాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.
pic.twitter.com/98LdP72e79 — ANI (@ANI) October 24, 2024The severe cyclonic storm “DANA” (pronounced as Dana) over central & adjoining northwest Bay of Bengal moved north-northwestwards with a speed of 12 kmph during the past 6 hours, and lay centred at 0530 hrs IST of today, the 24th of October, over northwest & adjoining central Bay…
ముఖ్యంగా భువనేశ్వర్‌లో భారీ వర్షాలు పడతాయని, రాత్రిపూట గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మయూర్‌భంజ్, బాలాసోర్, భద్రక్, కేంద్రపరా, జగత్‌సింగ్‌పూర్, జాజ్‌పూర్ జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని రెడ్ అలర్ట్ ప్రకటించింది. కటక్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పూరీ, ఖోర్ధా, నయాఘర్, ధెంకనల్, కియోంజర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక, సుందర్‌గఢ్, డియోగర్, అంగుల్, బౌధ్, కంధమాల్, గంజాంలలో ఎల్లో అలర్ట్ అమలులో ఉంది. కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. . వందలాది చెట్లు నేలకూలడంతో ప్రధాన రహదారులు నిలిచిపోయాయి. రోడ్డుపై కూలిన చెట్లను తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.












Click it and Unblock the Notifications