Cyclone Mocha: దిశ మళ్లింది: 14న తీరాన్ని తాకనున్న పెను తుఫాన్

కోల్‌కత: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాన్‌ బలపడింది. ఈ సాయంత్రానికి మరింత ఉధృతంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.

ఈ నెల 6వ తేదీన ఆగ్నేయ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మోచా తుఫాన్ ఒడిశా-పశ్చిమబెంగాల్ పైపు ప్రయాణిస్తుందని మొదట్లో అంచనాలు వెలువడ్డాయి.

Cyclone Mocha intensify into cyclonic storm to hit Bangladesh

ఈ తుఫాన్ దిశ మళ్లింది. బంగ్లాదేశ్- మయన్మార్‌ వైపు ఈ తుఫాన్ తన దిశను మళ్లించుకున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 14వ తేదీ నాటికి బంగ్లాదేశ్ ఆగ్నేయ ప్రాంతం- మయన్మార్ ఉత్తర తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ తుఫాన్ అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమం- ఆగ్నేయ దిశగా 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

క్రమంగా ఇది బంగ్లాదేశ్-మయన్మార్ వైపు కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం, మణిపూర్ సహా బంగ్లాదేశ్, మయన్మార్‌లల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలిపింది. ఈ నెల 14వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.

తీరానికి చేరువ అవుతున్న కొద్దీ ఈదురుగాలుల తీవ్రత 80 నుంచి 100 కిలోమీటర్లకు పెరగొచ్చని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది. వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+