గుజరాత్‌కు తప్పిన 'వాయు' గండం.. దిశ మార్చుకున్న తుఫాను
Recommended Video
అహ్మదాబాద్ : గుజరాత్‌కు గండం తప్పింది. తీరం వైపు శరవేగంగా దూసుకొచ్చిన వాయు తుఫాను రాత్రికి రాత్రి దిశ మార్చుకుంది. తీరం వైపు కాకుండా సముద్రంలోకి పయనిస్తోంది. దీంతో మూడు నాలుగురోజులుగా టెన్షన్ పడుతున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను దిశ మార్చుకున్నప్పటికీ పశ్చిమ తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది.

మరో 48గంటల పాటు అప్రమత్తం
గుజరాత్ పశ్చిమ తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో పాటు సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రానున్న 48 గంటల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను పెను ప్రభావం చూపనుందన్న కారణంతో అప్రమత్తమైన అధికారులు గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతం డయ్యూ నుంచి దాదాపు 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తక్షణ సాయం అందించేందుకు 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు
వాయు తుఫాను ప్రభావంతో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను హెచ్చరికలను ఉపసంహరించుకునే వరకు తీర ప్రాంతంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వాతావరణం అనుకూలంగా కారణంగా పశ్చిమ రైల్వే 70ట్రైన్లు రద్దు చేయగా.. మరో 28రైళ్ల దారి మళ్లించింది. విమాన సర్వీసులపైనా తుఫాను ప్రభావం పడింది. పోర్ బందర్, డయ్యూ, భావ్ నగర్, కాండ్లా ఎయిర్‌పోర్టుల్లో సేవలు నిలిచిపోయాయి.

ముంబైపైనా వాయు ప్రభావం
వాయు తుఫాను ప్రభావం ముంబైపైనా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా దాదాపు 400 ఫైట్లు రాకపోకలు ఆలస్యమయ్యాయి. రెండు విమానాలను దారి మళ్లించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications