ఢిల్లీలో తిరుమల లడ్డూలు పంచిన డీకే ఫ్యాన్స్, దేవుడే కాపాడాలి, బెయిల్ కోసం, తుగ్లక్!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ ముందు కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ అభిమానులు (ఫ్యాన్స్) తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు పంచిపెట్టారు. మా నాయకుడు డీకే. శివకుమార్ కు ఈ రోజు బెయిల్ వస్తుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం (తిరుమల లడ్డూ) ఆయనకు ఇవ్వాలని పోలీసులు, ఈడీ అధికారుల ముందు డీకే. శివకుమార్ అభిమానులు మనవి చేశారు. ఆ దేవుడే మా నాయకుడిని కాపాడాలని డీకే అభిమానులు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

తిరుమలలో పూజలు
బెంగళూరు నగర శివార్లలోని జిగణికి చెందిన మాజీ మంత్రి డీకే. శివకుమార్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈడీ అధికారులు అరెస్టు చేసిన మా నాయకుడు డీకే. శివకుమార్ కు శుక్రవారం బెయిల్ మంజూరు కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామని డీకే అభిమానులు అంటున్నారు.

తుగ్లక్ పోలీస్ స్టేషన్
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందిన డీకే. శివకుమార్ ఆరోగ్యం కుదట పడటంతో శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. శుక్రవారం మద్యాహ్నం డీకే శివకుమార్ ను ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో అధికారులు హాజరుపరచనున్నారు.

తిరుమల లడ్డూలతో ప్రత్యక్షం
తిరుమలలో ప్రత్యేక పూజలు చేసిన డీకే శివకుమార్ అభిమానులు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలు తీసుకుని ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలోని తుగ్లక్ పోలీస్ స్టేషన్ ముందు తిరుమల లడ్డూలతో ప్రత్యక్షం అయిన డీకే. శివకుమార్ అభిమానులు ఆ లడ్డూలు తీసుకెళ్లి డీకే. శివకుమార్ కు ఇవ్వాలని ఈడీ అధికారులు, పోలీసులకు మనవి చేశారు.

స్థానికులకు స్వామి ప్రసాదం
తిరుమల లడ్డూలు డీకే. శివకుమార్ కు ఇవ్వడానికి ఈడీ అధికారులు, పోలీసులు ఆలోచించారు. ఆ సమయంలో డీకే. శివకుమార్ అభిమానులు పోలీస్ స్టేషన్ ముందు సంచరిస్తున్న స్థానికులకు తిరుమల లడ్డూలు పంచిపెట్టారు. డీకే. శివకుమార్ కు ఈ రోజు కచ్చితంగా బెయిల్ వస్తుందని డీకే. శివకుమార్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

డీకే భవిష్యత్తు ఏమిటి ?
సెప్టెంబర్ 3వ తేదీన ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ డీకే. శివకుమార్ కస్టడీ కాలం పూర్తి అవుతోంది. శుక్రవారం డీకే. శివకుమార్ ను ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. డీకే. శివకుమార్ కు బెయిల్ ఇప్పించాలని ఆయన తరుపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈడీ అధికారులు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానంలో అభ్యంతరం వ్యక్తం చేస్తే డీకే. శివకుమార్ పరిస్థితి ఏమిటని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications