వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మా కుక్కను వెతికి పెట్టండి’: కంటతడిపెట్టిన ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఎదురైన సమస్యలే ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులకు ఎదురవుతున్నాయి. ‘మా గేదెలు తప్పిపోయాయి.. వాటిని వెతికిపెట్టండి' అంటూ గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రి అజాంఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చేసేదేం లేక, ఆ రాష్ట్ర పోలీసులు వాటిని వెదికిపెట్టి యజమానికి అప్పగించేశారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితే మధ్యప్రదేశ్‌ పోలీసులకు ఎదురైంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దాబ్రా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇమారతీ దేవికి చెందిన లాబ్రడార్‌ జాతి పెంపుడు కుక్క తప్పిపోయింది. దీంతో తీవ్ర విచారంలో మునిగిపోయిన ఎమ్మెల్యే కంటతడిపెట్టింది.

Dabra MLA breaks into tears as Labrador goes missing, Gwalior police begins search

ఆ కుక్కను త్వరగా పట్టుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరాలు తెలిపారు. భావోద్వేగానికి గురై తన విచారాన్ని బహిరంగంగా ప్రకటించారు.

మంగళవారం సాయంత్రం నుంచి తమ పెంపుడు కుక్క బ్రుజో కనిపించడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు దానిని వెతికే పనిలో పడ్డారు.

English summary
As Uttar Pradesh police's hunt for locating minister Azam Khan’s missing buffalos had hit headlines last year, their counterparts in Madhya Pradesh are finding themselves in a similar situation. They have been handed the task of finding an MLA’s missing dog in Gwalior(Dabra).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X