కులం: ప్రియుడితో మాట్లాడిందని కూతురుపై కత్తితో దాడి

దాడికి పాల్పడిన అనంతరం బాధితురాలి తండ్రి, నిందితుడు ఘటన స్థలం నుంచి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. సుమ, చిన్నస్వామి ఇద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా, సుమ తన తండ్రి అశోక్ రెడ్డికి ఈ విషయం చెప్పడంతో అతడు వారి వివాహానికి అంగీకరించలేదు.
అతనిది తక్కువ కులమని.. అతనితో మాట్లాడకూడదని, మళ్లీ కలవకూడదని హెచ్చరించాడు. బుధవారం తన తండ్రికి చెందిన చేనేత పరిశ్రమలో విధులు నిర్వహించేందుకు సుమ వెళ్లింది. కాగా, అక్కడికి చిన్నస్వామి రావడంతో అతనితో మాట్లాడుతోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అశోక్ రెడ్డి చిన్నస్వామిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆందోళనకు గురైన సుమ తన తండ్రిని అడ్డుకోబోయింది.
అశోక్ రెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత అశోక్ రెడ్డి.. చిన్నస్వామిపై దాడికి ప్రయత్నించాడు. చిన్నస్వామికి గాయాలు కావడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు అశోక్ రెడ్డి. తీవ్ర గాయాలపాలైన సుమను చిన్నస్వామి.. బెంగళూరులోని ఎస్‌టి జాన్స్ ఆస్పత్రికి తరలించాడు. బాధితురాలి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు అశోక్ రెడ్డిపై కేసు నమోదు చేసి, గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications