హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు.. డైలీ హంట్‌లో నిరంతర ప్రత్యక్ష ప్రసారం

హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలోని హుజూర్‌నగర్‌‌లో ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. గత రెండు, మూడు వారాలుగా ప్రచార కార్యకార్యక్రమాలతో రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. అక్టోబర్ 21వ తేదీన పోలింగ్, 24 తేదీన 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన న్యూస్ యాప్ డైలీ హంట్ ఎన్నికల ఫలితాల విశ్లేషణను ప్రత్యేకంగా అందించేందుకు సిద్ధమైంది. ఎన్నికల ఫలితాల రోజున ప్రతీ నిమిషం బ్రేకింగ్, సంచలన వార్తలను అందించేందుకు డైలీ హంట్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.

తెలంగాణ విషయానికి వస్తే హుజూర్ నగర్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్‌లో ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో నిలువగా.. అధికార టీఎస్ఆర్ పార్టీ నుంచి సైదిరెడ్డి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల ప్రచారం నువ్వా? నేనా అనే విధంగా సాగింది. ఈ ఎన్నిక ఫలితంపై తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.

Daily Hunt Election 2019 live coverage: results of HuzurNagar, Haryana, Maharashtra

మహారాష్ట్ర విషయానికి వస్తే 288 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 150 సీట్లు, శివసేన 124 సీట్లలో పోటీ చేయాలని ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు ఉధృతంగా ప్రచారం చేశాయి. ఇక కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీట్ల ఒప్పందం చేసుకొని బరిలో నిలిచాయి. బీజేపీ, శివసేన అలయెన్స్‌ను ధీటుగా ఎదురించేందుకు ప్రయత్నించింది.

ఇక హర్యానా విషయానికి వస్తే.. అసెంబ్లీలో 90 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు కాగా, నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) , జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఎన్నికల పోరులో నిలిచాయి.

ఇక దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యంగా మారిన రెండు రాష్ట్రాల ఎన్నికలతోపాటు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని అక్టోబర్ 24 వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు సమగ్రంగా అందించేందుకు డైలీ హంట్ సిద్ధమైంది. అభ్యర్థుల అధ్యికత, గెలుపు ఓటములు సమాచారం.. పార్టీల బలాబలాలు, ఫలితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను యాప్ ద్వారానే కాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్, హలో యాప్ లాంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పాఠకులకు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో డైలీ హంట్ ముందుకొస్తున్నది. వార్తలు, వీడియో కథనాల కోసం నిరంతర ప్రత్యక్ష వార్తా సమాచారం కోసం డైలీ హంట్ యాప్‌కు లాగిన్ అయి పక్కా సమాచారాన్ని అందుకోండి.

డైలీ హంట్ విషయానికి వస్తే.. దేశంలో 14 భాషల్లో వార్తలను అందిస్తున్నది. దాదాపు 1000కి పైగా కంటెంట్ ప్రొవైడర్స్ డైలీ హంట్‌లో ఉన్నారు. 16 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్స్‌తో వెబ్ మీడియాలో అగ్రగామిగా డైలీ హంట్ దూసుకెళ్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+