ఒకప్పుడు రోజు కూలీ.. ఇప్పుడు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ విన్నర్..
చాలా మందికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ పేదరికంతో వారి టాలెంట్ బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఇలా ఓ మహిళ తన పేదరికం కారణంగా తను అనుకున్నది సాధించలేకపోయింది. కానీ డాన్స్ ఇండియా డాన్స్ ఆమె జీవితాన్నే మార్చేసింది. వర్ష డాన్సే కెరీర్ అనుకుని ఎన్నో కలలు కన్నది. కానీ పెళ్లి ఆమె జీవితాన్ని మార్చింది. అప్పటి వరకు డాన్సర్ అవుతానని అనుకున్న ఆమె కూలీగా మారిపోయింది.
17 ఏళ్ల వయస్సులోనే
తకున్న డ్యాన్స్ కళను గుర్తించిన భర్త ఆమె ప్రోత్సాహించాడు. దీంతో ఆమె ఆదివారం జరిగిన 'డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ మూడో సీజన్'లో విజేతగా నిలిచింది. ట్రోఫీతో పాటు ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా గెలిచుకుంది. 17 ఏళ్ల వయస్సులోనే వర్ష అత్తగారింట్లో అడుగు పెట్టాక చాలా కష్టాలు ఎదుర్కొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. జీవితం భారం కావడంతో భర్తతో పాటు కూలీ వెళ్లింది.
సూపర్ మామ్ సీజన్ 3
తన జీవితంలా కొడుకు జీవితం కాకూడదని.. తన కుమారుడి బాగ చదివించాలని ఆమె మరింత కష్టం చేసేది. ఈ క్రమంలో
'డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్స్ సీజన్ 3' యాడ్ చూసింది. తనలో మరుగున పడిపోయిన డ్యాన్స్ గుర్తుకు తెచ్చుకుంది. 'డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ సీజన్ 3' లో అడుగుపెట్టాలంటే డాన్స్ చేసి వీడియో పంపాలి. అందుకని ట్రైనింగ్ తీసుకుందామంటే డబ్బులు వర్షకు పేదరికం అడ్డొచ్చింది.
ఫైనల్‍కు చేరింది
ఆమె రోజూ కూలి పని నుంచి ఇంటికి వచ్చాక టీవీలో డాన్సర్ వర్తికా ఝా డాన్స్ చేస్తూ ఆమె లాగా స్టెప్పులు వేయడం ప్రాక్టీస్ చేసింది. ఆమె డాన్స్ బాగా చేయడం చూసి భర్త ప్రోత్సహించాడు. షోలోకి వచ్చాక తన ఫేవరెట్ డాన్సర్ వర్తిక మెంటార్‌గా దొరకడంతో వర్షలో ఆత్మవిశ్వాసం పెరిగింది. బాగా ప్రాక్టిస్ చేసి ఫైనల్‍కు చేరింది. ఆరుగురితో పోటీ పడి విజేతగా నిలిచింది.

అప్పుల బాధలు
డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు వర్ష ముంబైకి రావడానికి అప్పులు చేసింది వర్ష. ఆ తర్వాత అప్పుల ఇచ్చిన వారి వేధింపులు పెరిగాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక వర్ష సరిగా డ్యాన్స్ చేయలేదు. దీన్ని గుర్తించిన కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఆమెకు భరోసా ఇచ్చాడు. వర్ష వాళ్ల కుటుంబం చేసిన అప్పులు తీరుస్తానని హామీ ఇచ్చారు. వర్ష ఇబ్బందులు చూసిన స్పాన్సర్లు ప్రైజ్‌మనీకి అదనంగా రెండు లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు .












Click it and Unblock the Notifications