డైలీహంట్ లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మెరుపువేగంతో

రాంచీ: దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అందరి కళ్లూ వాటి ఫలితాల మీదే ఉంటాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారు అనే ఉత్కంఠత అందరిలోనూ కనిపిస్తుంటుంది. తాము అభిమానిస్తోన్న పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకోని వారు బహుశా ఉండకపోవచ్చు. మొన్నటికి మొన్నే హర్యానా, మహారాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన పరిణామాలు దేశ ప్రజలను ఎంతగా ఆకర్షించాయో చెప్పుకోనక్కర్లేదు.

ఎన్నికల ఫలితాల పట్ల ఉత్కంఠత..

ఎన్నికల ఫలితాల పట్ల ఉత్కంఠత..

ప్రత్యేకించి- మహారాష్ట్ర. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు వారాల తరువాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ మధ్యలో కొద్దిరోజుల పాటు రాష్ట్రపతి పాలనను కూడా చవి చూసింది మహారాష్ట్ర. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చోటు చేసుకున్న ఊహాతీత పరిణామాలు, హైడ్రామాలు, అనూహ్య మలుపులు.. దేశ ప్రజలను నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేశాయి. ఆ రాజకీయ చదరంగంలో చివరికి శివసేన విజేతగా నిలిచింది. భిన్న ధృవాలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయిదో విడతలో

అయిదో విడతలో

తాజాగా- మరో రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అదే జార్ఖండ్. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అయిదు దశల్లో పోలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇప్పటిదాకా నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసిందక్కడ. ఈ నెల 21వ తేదీన తుది దశ పోలింగ్ ను నిర్వహించబోతున్నారు. అయిదో దశలో రాజమహల్, బొయిరో, లితిపారా, పాకూర్, మహేశ్ పూర్, శికారిపారా, దుమ్కా, జామా, జార్ముండి, నాలా, జంతారా, సరత్, పోరెయ్ హాట్, గొడ్డా, మహాగామల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

23న కౌంటింగ్..

23న కౌంటింగ్..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడి కానున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 81. తక్కువ స్థానాలే కావడంతో మధ్యాహ్నానికే వాటి ఫలితాలు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. అధికారాన్ని ఎవరు అందుకుంటారు? ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారనే విషయం తేలిపోతుంది. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ ఒంటరిపోరాటాన్ని చేయట్లేదు. ఈ రెండు పార్టీలు కూడా మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిల్చున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను ఏ కూటమికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ మరోసారి లేక.. కాంగ్రెస్ కు అవకాశమా?

బీజేపీ మరోసారి లేక.. కాంగ్రెస్ కు అవకాశమా?

మొన్నటిదాకా జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగింది. లోక్ జనశక్తి పార్టీ, ఆఖిల జార్ఖండ్ విద్యార్థి యూనియన్ లతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ మరోసారి జార్ఖండ్ లో పాగా వేస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తుందా? అనే విషయాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

డైలీ హంట్ లో మెరుపు వేగంతో అప్ డేట్స్..

డైలీ హంట్ లో మెరుపు వేగంతో అప్ డేట్స్..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారాన్ని, కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు మెరుపువేగంతో ప్రజలకు అందించడానికి ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలుగు సహా ఎనిమిది భాషల్లో ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించనుంది. లైవ్ అప్ డేట్స్, ప్రతి రౌండ్ కు సంబంధించిన మెజారిటీ.. వంటి అంశాలపై ప్రత్యేక కథనాలను అందించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+