Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీం కోర్టు తీర్పు: ఏప్రిల్ 2న దళిత సంఘాల భారత్ బంద్

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్టు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది.

అపాయింటింగ్ అథారిటి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసేందుకు సన్నద్ధమయింది.

Dalit activists protest against dilution of provision of SC/ST Act

మరోవైపు, సుప్రీం నిర్ణయంపై దళిత సంఘాలు కొన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయు. సుప్రీం నిర్ణయం ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రతిబందంకంగా మారుతుందని చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన భారత్ బందుకు పిలుపునిచ్చాయి.

అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరే కేసులు నమోదు చేస్తే దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+