వైరల్ వీడియో- చెప్పులు నాకించుకున్న లైన్‌మెన్

లక్నో: మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో చూశాం. ఓ గిరిజనుడిపై ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. ఆ గిరిజనుడిపై మూత్రం పోశాడు. మధ్యప్రదేశ్‌లోని సిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. బాధితుడిని కలుసుకున్నాడు. ఆయన కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేయించారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు.

Uttar Pradesh

దీన్ని విస్మరించకముందే అలాంటి ఉదంతమే ఇప్పుడు మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోన్‌భద్ర జిల్లాలో ఓ దళిత యువకుడు.. స్థానిక లైన్‌మెన్ చెప్పులు నాకాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని షాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బల్దీ గ్రామంలో ఈ ఉదంతం సంభవించింది.

బాధిత యువకుడు దళితుడని చెబుతున్నారు. ఆయన పేరు రాజేంద్ర కుమార్. రాబర్ట్స్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహువార్ ఆయన స్వస్థలం. రెండు రోజుల కిందట బల్ది గ్రామంలో నివసించే తన మేనమామ ఇంటికి వెళ్లాడు. బిల్లు కట్టకపోవడం వల్ల సిబ్బంది వారి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీన్ని గమనించిన బాధిత యువకుడు రాజేంద్ర.. అక్రమంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకున్నాడు.

ఈ విషయం స్థానిక లైన్‌మెన్ తేజ్ బలిసింగ్‌కు తెలిసింది. దీనితో అతను ఆగ్రహంతో ఆ యువకుడి ఇంటికి వచ్చాడు. అతనిపై దౌర్జన్యానికి దిగాడు. అందరి ముందూ కొట్టాడు. దుమ్ము పట్టిన తన చెప్పులను ఆ యువకుడి నోటితో శుభ్రం చేయించాడు. గుంజీలు తీయించాడు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తాననీ హెచ్చరించాడు.

అక్కడే ఉన్న స్థానికుడొకరు ఈ వ్యవహారం మొత్తాన్నీ తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఇది పోలీసుల దృష్టికి చేరడంతో వారు స్పందించారు. తేజ్ బలిసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు షాగంజ్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+