హత్య కేసులో నిందితుడు: జైల్లో అమ్మాయిలతో నృత్యాలు

చండీగఢ్: పంజాబ్ జైల్లలో ఏం జరుగుతుందనే విషయానికి మచ్చుతునకగా ఓ సంఘటన జరిగింది. ఖైదీ ఆనందం కొసం ఆ జైలర్ నిబంధనలు గాలికి వదిలి ఖైదీలు ఉన్న బ్యారెక్ ల దగ్గరకు అమ్మాయిలను తీసుకు వచ్చి ఏకంగా డ్యాన్స్ లు చేయించారు.

ఖైదీ సంతృప్తి కోసం ఏకంగా రూ. 16 వేలు ఖర్చు చేశారు. పంజాబ్ లోని చండీఘడ్ సెంట్రల్ జైలులో సర్వణ్ సింగ్ అనే వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. అతను ఓ హత్య కేసులో నిందితుడు. 2013వ సంవత్సరంలో యువజన కాంగ్రెస్ నేత సుఖరాజ్ సింగ్ ను సర్వణ్ సింగ్ హత్య చేశాడని అరెస్టు చేసి జైలులో పెట్టారు. అతను అమ్మాయిలతో చిందులు వేశాడు.

 Dance show held in Punjab jail flouting norms

సర్వణ్ సింగ్ కు అమ్మాయిల డ్యాన్స్ లు అంటే పిచ్చి. అంతే తన మనస్సులోని కోర్కెను జైలర్ దేవీందర్ సింగ్ రణ్ ధావాకు చెప్పాడు. జైలర్ అది ఎంత పని నేను చేసి పెడుతానని హామి ఇచ్చాడు. తరువాత జైలర్ దేవీందర్ సింగ్ గురుదాస్ పూర్ జిల్లాలోని ఫతేగడ్ చురియాన్ గ్రామస్తులను సంప్రదించాడు.

జైలులో డ్యాన్స్ లు చెయ్యడానికి అమ్మాయిలు కావాలని చెప్పాడు. ఆ గ్రామంలోని సాంప్రదాయ నాట్య బృందాన్ని తీసుకువచ్చి జైలులో డ్యాన్స్ లు చేయించారు. ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో అదే జైలులో ఉన్నఅకాలీదళ్ యువజన నేత, సర్వణ్ సింగ్ అమ్మాయిల విషయంలో పరస్పరం దాడులు చేసుకుని కత్తులతో పొడుచుకున్నారు.

ఇద్దరు ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగు చూసింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా జైలర్ దేవీందర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టించారని జైలు సూపరింటెండెంట్ ఆర్. కే. శర్మ జైళ్ల శాఖ ఏడీజీపీ మీనాకు నివేదిక పంపించారు. దేవీందర్ ను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+