పెళ్లి చేసుకోమన్న డెనిల్లే కోహ్లీతో భేటీ (పిక్చర్స్)
డెర్బీ: ఇంగ్లాండు మహిళా క్రికెటర్ డెనిల్లే వ్యాట్ భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని కలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కోహ్లీతో వివాహానికి ట్విట్టర్‌లో ప్రతిపాదన చేసిన తర్వాత ఈ భేటీ జరిగింది. జులై 2వ తేదీన ఈ కలయిక జరిగింది. ఆమె సోదరుడు మాక్స్ వ్యాట్ ఆ చిత్రాలను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దానికి పొంగిపోయిన డెనిల్లే అదే రోజు 2014 ఏప్రిల్ 4వ తేదీన ట్విట్టర్‌లో కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో అంటూ ట్వీట్ చేసింది.
ఆ సమయంలో ఆమె ట్విట్టర్‌న ు 25 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. వారి సంఖ్య ఇప్పుడు 53 వేలకు పెరిగింది. డెర్బీలో జులై 1 నుంచి 3వ తేదీ వరకు డెర్బీషైర్‌పై జరిగిన మూడు రోజుల మ్యాచ్ సందర్భంగా వారిద్దరు కలుసుకున్నారు. ఈ మ్యాచును ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలుచుకుంది.

ఆమెతో కోహ్లీ ఫోజు
డెనిల్లేతో కోహ్లీ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలను డెనిల్లే సోదరుడు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

రెండు ఫోటోలు ఇలా..
మైదానంలో కోహ్లీ, డెనిల్లే కలిసి ఫోజు ఇచ్చిన రెండు ఫొటోలను మాక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. క్యూట్ కపుల్ అవుతారంటూ ఓ ఫొటోకు కామెంట్ కూడా రాశాడు.

మరో ఫోటొ ఇలా..
మరో ఫోటోకు "Here's @Danni_Wyatt with @imVkohli" అని రాశాడు.

మాక్స్ కూడా కోహ్లీతో..
మాక్స్ కూడా విరాట్ కోహ్లీతో ఫొటో దిగాడు. దానికి "Legend! @imVkohli" అని రాశాడు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications