ఢిల్లీలో మరో దారుణం: డానిష్ మహిళపై గ్యాంగ్ రేప్

Danish woman allegedly robbed and gang-raped near New Delhi railway station
న్యూఢిల్లీ‌: తనపై న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి సామూహిక అత్యాచారం జరిగిందని డానిష్ జాతీయురాలు ఆరోపించింది. నిందితులు దిమ్మరులని తెలుస్తోంది. తనపై లైంగిక దాడి చేసిన తర్వాత తనను దోపిడీ కూడా చేశారని 51 ఏళ్ల డానిష్ జాతీయురాలు ఆరోపించింది.

వారం రోజుల క్రితం ఆమె భారతదేశానికి వచ్చింది. తొలుత ఆగ్రా సందర్శించింది. ఆ తర్వాత మంగళవారంనాడు ఢిల్లీకి వచ్చింది. హోటల్‌ నుంచి ఆమె మంగళవారం సాయంత్రం నేషనల్ మ్యూజియాన్ని సందర్శించడానికి వెళ్లింది.

హోటల్‌కు తిరిగి వచ్చే క్రమంలో దారి తప్పింది. ఆ స్థితిలో తనపై న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద సామూహిక అత్యాచారం జరిపారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వద్ద ఉన్న నగలు, ఇతర విలువైన వస్తువులను వారు ఎత్తుకెళ్లారు.

ఏదో విధంగా ఆమె హోటల్‌కు చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను పట్టుకోవడానికి పోలీసులు పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. కొన్ని వారాల క్రితం ఇదే ప్రదేశంలో 16 ఏళ్ల అమ్మాయిపై లైంగిక దాడి జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+