Daughter: కూతురిపై లైంగిక దాడి చేసిన పనిమనిషి, చంపేసి శవం మాయం చేసిన దంపతులు, క్లైమాక్స్ !

ముంబాయి: మైనర్ కూతురితో కలిసి దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. స్కూల్ లో చదువుతున్న కూతురు అంటే దంపతులకు ప్రాణం. ఇంట్లో పని చెయ్యడానికి ఓ వ్యక్తి కావాలని అనుకున్నాడు. ముసలాడు అయితే ఎలాంటి సమస్య ఉండదని, ఇంటి దగ్గరే ఉంటాడని భర్త ఓ వృద్దుడి పనిలో పెట్టుకున్నాడు. ప్రతిరోజు దంపతులు వారి బెడ్ రూమ్ లో, కూతురు మరో బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. వీరి ఇంటిలో నివాసం ఉంటున్న వృద్దుడు మరో గదిలో నిద్రపోతున్నాడు. రాత్రి అమ్మాయి గదిలో నుంచి ఏడుపులు వినిపించాయి. కూతురు ఏడస్తున్న విషయం గుర్తించిన దంపతులు అక్కడికి వెళ్లి కూతురి నుంచి వివరాలు తెలుసుకున్న దంపతులు హడలిపోయారు. కూతురి మీద లైంగిక దాడి చేశాడని తెలుసుని రగిలిపోయారు. మా కూతురి మీద లైంగిక దాడి చేస్తాశాడని ఆరోపిస్తూ దంపతులు అతన్ని కొట్టి చంపేసి శవాన్ని రోడ్డు పక్కన విసిరేసి ఎలాంటి సాక్షాలు చిక్కకుండా చేసి చేతులు దులుపుకున్నారు.

 కూతుర్ని ప్రాణంగా చూసుకుంటున్న దంపతులు

కూతుర్ని ప్రాణంగా చూసుకుంటున్న దంపతులు

ముంబాయిలోని సాత్ నగర్ లో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి అతని భార్య, మైనర్ కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు. మైనర్ కూతురితో కలిసి బీహార్ కు చెందిన సూరజ్ దంపతులు చాలాకాలం నుంచి ముంబాయి నగరంలో చాలా సంతోషంగా జీవిస్తున్నారు. స్కూల్ లో చదువుతున్న కూతురిని సూరజ్ దంపతులు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు.

బీహార్ నుంచి పిలుచుకుని వచ్చారు

బీహార్ నుంచి పిలుచుకుని వచ్చారు

ఇంట్లో పని చెయ్యడానికి ఓ వ్యక్తి కావాలని సూరజ్ అనుకున్నాడు. ముసలాడు అయితే ఎలాంటి సమస్య ఉండదని, ఇంటి దగ్గరే ఉంటాడని అనుకున్న సూరజ్ బీహార్ కు చెందిన ఓ వృద్దుడి వారం రోజుల క్రితం పనిలో పెట్టుకున్నాడు. సూరజ్ దంపతులకు, ఇంటిలో పని చెయ్యడానికి వెళ్లిన వృద్దుడికి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది.

 రగిలిపోయిన దంపతులు

రగిలిపోయిన దంపతులు

ప్రతిరోజు సూరజ్ దంపతులు వారి బెడ్ రూమ్ లో, వీరి కూతురు మరో బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. వీరి ఇంటిలో నివాసం ఉంటున్న వృద్దుడు మరో గదిలో నిద్రపోతున్నాడు. వారం రోజుల నుంచి సూరజ్ ఇంటిలో ఎవరి పాటికి వాళ్లు నిద్రపోతున్నారు. అయితే గదిలో ఒంటరిగా నిద్రపోతున్న మైనర్ అమ్మాయిని ఇంటి పని చేస్తున్న వృద్దుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిసింది.

 చంపేసి శవం మాయం చేసిన దంపతులు

చంపేసి శవం మాయం చేసిన దంపతులు

రాత్రి అమ్మాయి గదిలో నుంచి ఏడుపులు వినిపించాయి. కూతురు ఏడస్తున్న విషయం గుర్తించిన సూరజ్ దంపతులు ఆమె రూమ్ లోకి వెళ్లి కూతురి నుంచి వివరాలు తెలుసుకున్న సూరజ్ దంపతులు హడలిపోయారు. కూతురి మీద లైంగిక దాడి చేశాడని తెలుసుని రగిలిపోయారు. మా కూతురి మీద లైంగిక దాడి చేస్తాశాడని ఆరోపిస్తూ సూరజ్, అతని భార్య కలిసి బెల్ట్, ఎదరు కర్రలతో అతన్ని కొట్టి దారుణంగా చంపేశారు.

 10 రోజుల తరువాత చిక్కిన దంపతులు

10 రోజుల తరువాత చిక్కిన దంపతులు

శవాన్ని మున్ ఖుర్ద్ రోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన విసిరేసి ఎలాంటి సాక్షాలు చిక్కకుండా చేసి చేతులు దులుపుకున్నారు. స్థానికులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 10 రోజుల తరువాత హత్యకు గురైన వృద్దుడి పేరు, వివరాలు చిక్కాయి. కూపీలాగిన పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా జరిగిన విషయం మొత్తం చెప్పాడు. పోలీసులు సూరజ్ ను, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+