షాక్: కూతురి గదిలో రాత్రి పూట బోయ్‌ఫ్రెండ్, తండ్రిపై తిరగబడిన లవర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రాత్రిపూట తన కూతురి గదిలో బోయ‌్‌ఫ్రెండ్‌ను చూసి గొడవపడ్డాడు తండ్రి. ఈ గొడవ ముదిరింది. అయితే కూతురి బోయ్‌ఫ్రెండ్ కు తండ్రికి మధ్య గొడవ పెరిగింది. అయితే ఈ గొడవలో తండ్రి విశ్వనాథ్ చనిపోయారు. అయితే తన భర్త మరణానికి తన కూతురితో పాటు ఆమె బోయ్ ప్రెండ్ కారణమని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

షాక్: భర్తపై ఇష్టం లేక, ప్రియుడి కోసం గ్యాంగ్‌రేప్ నాటకం, ఏమైందంటే?

తన కూతురి గదిలో బోయ్‌ఫ్రెండ్ ను చూసిన తండ్రికి విశ్వనాథ్‌కు కోపం వచ్చింది.న్యూఢిల్లీలో చోటు చేసుకొన్న ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆవేశంలో చోటు చేసుకొన్న ఘటన కుటుంబంలో విషాదానికి కారణమైంది.

దారుణం: తల్లి ప్రోత్సాహం, మైనర్ బాలికపై తండ్రి ఐదేళ్ళుగా లైంగికదాడి

రాత్రిపూట కూతురి గదిలో ఆమె బోయ్ ప్రెండ్ ను చూసిన విశ్వనాథ్ అతనిపై దాడికి దిగే పరిస్థితి చోటు చేసుకొంది. ఒకరిపై మరోకరు దాడి చేసుకొనే పరిస్థితి చోటు చేసుకొనే పరిస్థితి చోటు చేసుకోవడంతో విశ్వనాథ్ ఈ ఘటనలో మరణించాడని చెబుతున్నారు.

వివాహేతర సంబంధం: రెండోసారి వచ్చి హత్యకు గురయ్యాడు

కూతురి గదిలో బోయ్‌ఫ్రెండ్

కూతురి గదిలో బోయ్‌ఫ్రెండ్

ఢిల్లీలోని నోయిడాలోని అట్టా గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకొన్న ఘటన విశ్వనాత్ ప్రాణాలు పోయేలా చేసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న విశ్వనాథ్ సాహు తన కుమార్తె పూజా సాహు గదిలోకి వెళ్లాడు. అక్కడ కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌ ధర్మేంద్ర ను చూసి విస్తుపోయాడు. అతడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో పట్టు తప్పి కిందపడి మరణించాడు.

కూతురి బోయ్ ప్రెండ్ తో విశ్వనాధ్ గొడవ

కూతురి బోయ్ ప్రెండ్ తో విశ్వనాధ్ గొడవ

విశ్వనాథ్ ఇంటికి పక్కనే ధర్మేంద్ర నివాసం ఉంటారు.విశ్వనాథ్ కూతురు పూజతో ధర్మేంద్ర ప్రేమలో పడ్డాడు. అయితే ఆదివారం రాత్రి ప్రియురాలు పూజను కలుసుకొనేందుకు ధర్మేంద్ర విశ్వనాథ్ ఇంటికి వచ్చాడు. పూజ తండ్రి వాష్ రూముకు వెళ్లేందుకు లేవగా, కుమార్తె గదిలో ఎవరో ఉన్నట్టు గుర్తించాడు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా ధర్మేంద్ర కనిపించాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ధర్మేంద్రను వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని ఆదేశించాడు. ఇది కాస్తా ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

విశ్వనాథ్ చనిపోయారు

విశ్వనాథ్ చనిపోయారు

ధర్మేంద్రతో విశ్వనాత్ గొడవపడ్డారు. అయితే ఆదే సమయంలో తన ఇంటి నుండి వెళ్ళిపోవాలని విశ్వనాథ్ ధర్మేంద్రను ఆదేశించారు.గొడవ పెట్టుకొనే పరిస్థితి వచ్చింది. అయితే విశ్వనాథ్ మూడో అంతస్థు నుండి కిందకు దిగే సమయంలో పట్టు తప్పి కిందపడి పోయాడు. అయితే ఆయనను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ధర్మేంద్రతో పాటు పూజ విశ్వనాథ్ ను తోసేశారని విశ్వనాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ధర్మేంద్ర పరారీలో

ధర్మేంద్ర పరారీలో

విశ్వనాథ్ భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. తండ్రి మరణించినా కుమార్తెలో కించిత్ కూడా పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has lodged an FIR alleging that her husband was beaten to death by the daughter and her boyfriend in Noida on Sunday. The daughter has been arrested while her paramour is absconding, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి