Daughter: ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న మంత్రి కూతురు, తండ్రి మీద పోలీసులకు !

బెంగళూరు/ చెన్నై: ఎంతో చరిత్ర ఉన్న పార్టీలో లీడర్ గా పని చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆయన మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం రూలింగ్ పార్టీలో మంత్రిగా పని చేస్తున్న ఆయనకు ఓ కూతురు కూడా ఉంది. కూతురికి మంచి యువకుడిని చూసి పెళ్లి చెయ్యాలని మంత్రి అనుకున్నారు. మంత్రి ఆయన కూతురి కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇదే సమయంలో మంత్రి కూతురు ఇంటి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బందువులు, మంత్రిగారి అనుచరులు ఆమె కోసం వేట మొదలు పెట్టారు. చివరికి నా కూతురు కనపడటం లేదని, ఆమెను కిడ్నాప్ చేశారని మంత్రి స్వయంగా పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది. అయితే పక్క రాష్ట్రంలో ప్రత్యక్షం అయిన మంత్రి కూతురు ఓ మఠంలో ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తన తండ్రితో పాటు కుటుంబ సభ్యులతో తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని మంత్రి కూతురు ఐటీ హబ్ సిటీ పోలీసు కమీషనర్ ను ఆశ్రయించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

 సిట్టింగ్ మినిస్టర్ ముద్దుల కూతురు

సిట్టింగ్ మినిస్టర్ ముద్దుల కూతురు

తమిళనాడులో ఎంతో చరిత్ర ఉన్న పార్టీలో లీడర్ గా పని చేసిన శేఖర్ బాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే అయిన శేఖర్ బాబు ఎంకే. స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ప్రస్తుతం రూలింగ్ పార్టీలో మంత్రిగా పని చేస్తున్న శేఖర్ బాబుకు డాక్టర్ జయకల్యాణి అనే ముద్దుల కూతురు ఉంది.

 ఇంటి నుంచి పారిపోయిన మంత్రి కూతురు

ఇంటి నుంచి పారిపోయిన మంత్రి కూతురు

కూతురు జయకల్యాణికి మంచి యువకుడిని చూసి పెళ్లి చెయ్యాలని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు అనుకున్నారు. తమిళణాడు మంత్రి శేఖర్ బాబు ఆయన కూతురు జయకల్యాణి కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇదే సమయంలో మంత్రి శేఖర్ బాబు కూతురు జయకల్యాణి ఇంటి నుంచి పారిపోయింది.

 కూతురిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టిన మంత్రి

కూతురిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టిన మంత్రి

విషయం తెలుసుకున్న మంత్రి శేఖర్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బందువులు, మంత్రిగారి అనుచరులు జయకల్యాణి కోసం వేట మొదలు పెట్టారు. చివరికి నా కూతురు జయకల్యాణి కనపడటం లేదని, ఆమెను కిడ్నాప్ చేశారని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు స్వయంగా చెన్నైలో పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

 ప్రియుడిని పెళ్లి చేసుకున్న మంత్రి కూతురు

ప్రియుడిని పెళ్లి చేసుకున్న మంత్రి కూతురు

చెన్నైలోని ఇంటి నుంచి పారిపోయిన మంత్రి శేఖర్ బాబు కూతురు జయకల్యాణి పక్క రాష్ట్రం కర్ణాటకలో ప్రత్యక్షం అయంది. కర్ణాటకలోని రాయచూరులోని పాలస్వామి మఠంలో మంత్రి శేఖర్ బాబు కూతురు డాక్టర్ జయకల్యాణి ఆమె ప్రియుడు సతీష్ కుమార్ ను పెళ్లి చేసుకుంది.

Recommended Video

    Rajahmandry Business Man Send Ashadham Saare In A Grand Style To His Daughter | Oneindia Telugu
     మంత్రి మీద పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసిన కూతురు

    మంత్రి మీద పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసిన కూతురు

    తన తండ్రి శేఖర్ బాబు మంత్రి హోదాలో ఉన్నారని, ఆయనకు పలుకుబడి ఎక్కువగా ఉందని, తన తండ్రితో పాటు కుటుంబ సభ్యులతో తనకు, తన భర్త సతీష్ కుమార్ కు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని మంత్రి కూతురు డాక్టర్ జయకల్యాణి ఐటీ హబ్ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ ను ఆశ్రయించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులో మాకు పోలీసు భధ్రత కల్పించాలని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కూతురు పోలీసులను ఆశ్రయించడంతో తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+