Wife: మద్యం మత్తులో భార్యకు, కూతురికి తేడా తెలీలేదు, బెడ్ రూమ్ లో ?, సుత్తితో కొట్టి చంపేసిన భార్య !

చెన్నై: పెళ్లి చేసుకున్న తరువాత దంపతులు కొన్ని సంవత్సరాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. అప్పటికే దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పనిపాట లేకుండా గాలికి తిరుగుతున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. పీకలదాక మద్యం సేవించడం, భార్య సంపాధిస్తున్న డబ్బుతో జల్సాలు చెయ్యడం భర్తకు అలవాటు అయిపోయింది. రోజూ రాత్రి అయితే మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యతో గొడవపడటం, నానా హంగామా చేసి నిద్రపోవడం సర్వసాధారణం అయిపోయింది. జులాయిగా తిరుగుతున్న స్నేహితులు రాత్రి పార్టీ ఇవ్వడంతో పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన తాగుబోతుకు అతని భార్యకు, కూతురికి తేడా కనపడలేదు. నిద్రపోతున్న కూతురి పక్కకు వెళ్లిన తాగుబోతు కన్నకూతురి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. కన్నతండ్రి చేస్తున్న పనితో హడలిపోయిన కూతురు గట్టిగా కేకలు వేసింది. పక్కరూమ్ లో ఉన్న భార్య హడలిపోయి కూతురిని రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కామాంధుడు రెచ్చిపోవడంతో సహనం కోల్పోయిన భార్య సుత్తి తీసుకుని ఆమె భర్తను చంపేసి కూతుర్ని రక్షించుకుంది.

జులాయిగా తిరుగుతున్న భర్త

జులాయిగా తిరుగుతున్న భర్త

చెన్నై సిటీలోని ఒంటేరిలోని వజీమా నగర్ లో ప్రదీప్ (44) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 22 సంవత్సరాల క్రితం ప్రీతి (41) అనే యువతిని ప్రదీప్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత ప్రదీప్, ప్రీతి దంపతులు కొన్ని సంవత్సరాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ప్రదీప్ పనిపాట చెయ్యకుండా సుఖంగా ఉండటానికి అలవాటు పడ్డాడు.

 కూతురు, కొడుకు

కూతురు, కొడుకు

అప్పటికే దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రదీప్, ప్రీతి దంపతులకు 20 ఏళ్ల వయసు ఉన్న కూతురు, గౌతమ్ (11) అనే కుమారుడు ఉన్నారు. పనిపాట లేకుండా గాలికి తిరుగుతున్న ప్రదీప్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజూ పీకలదాక మద్యం సేవిస్తున్న ప్రదీప్ కు అతని భార్య ప్రీతి సంపాధిస్తున్న డబ్బుతో జల్సాలు చెయ్యడం అలవాటు అయిపోయింది.

కూతురికి పెళ్లి చెయ్యాలని చెబుతున్న భార్య

కూతురికి పెళ్లి చెయ్యాలని చెబుతున్న భార్య

రోజూ రాత్రి అయితే మద్యం సేవించి ఇంటికి వెలుతున్న ప్రదీప్ అతని భార్య ప్రీతితో గొడవపడటం, నానా హంగామా చేసి నిద్రపోవడం సర్వసాధారణం అయిపోయింది. కూతురికి 20 ఏళ్ల వయసు వచ్చిందని, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని, ఏదైనా పని చెయ్యాలని నిత్యం ప్రీతి ఆమె భర్త ప్రదీప్ కు పదేపదే చెబుతూ నెత్తినోరు కొట్టుకుంటున్నా అతని మాత్రం పద్దతి మార్చుకోలేదు.

మద్యం మత్తులో భార్యకు, కూతురికి తేడా తెలీలేదు

మద్యం మత్తులో భార్యకు, కూతురికి తేడా తెలీలేదు


జులాయిగా తిరుగుతున్న స్నేహితులు రాత్రి పార్టీ ఇవ్వడంతో పీకలదాక మద్యం సేవించిన ప్రదీప్ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తాగుబోతు ప్రదీప్ కు అతని భార్య ప్రీతికి, వయసుకు వచ్చిన కూతురికి తేడా కనపడలేదు. నిద్రపోతున్న కూతురి పక్కకు వెళ్లిన తాగుబోతు ప్రదీప్ కన్నకూతురు అని కూడా చూడకుండా ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

 భర్తను సుత్తితో కొట్టి చంపేసిన భార్య

భర్తను సుత్తితో కొట్టి చంపేసిన భార్య

కన్నతండ్రి చేస్తున్న పాడుపనితో హడలిపోయిన కూతురు గట్టిగా కేకలు వేసింది. పక్కరూమ్ లో ఉన్న ప్రీతి హడలిపోయి భర్త ప్రదీప్ ను పక్కకు తోసేసి ఆమె కూతురిని రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కామాంధుడు ప్రదీప్ మాత్రం కూతురి మీద రెచ్చిపోవడంతో సహనం కోల్పోయిన ప్రీతి ఇంట్లో ఉన్న సుత్తి తీసుకుని ఆమె భర్తను చంపేసి కూతుర్ని రక్షించుకుంది. భర్త ప్రదీప్ ను చంపేసిన ప్రీతి ఇంటి బయటకు వెళ్లి చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పింది. ప్రీతి, ఆమె కూతురు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెన్నైలోని ఒంటేరి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+