డౌట్ లేదు.. దావూద్ పాక్ లోనే ఉన్నాడు, ముషారఫ్ మాటలతో అనుమానం క్లియర్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి చూస్తే.. మాఫియా డాన్ దావూద్ పాకిస్తాన్ లోని కరాచీలోనే ఉన్నాడనే అనుమానాలను కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అసలెక్కడ ఉన్నాడు? భారత్ ఆరోపిస్తున్నట్లుగా అతడు ఇన్నాళ్లూ పాకిస్తాన్ లోని కరాచీలోనే తలదాచుకున్నాడా? లేక దుబాయ్ లో ఉన్నాడా?
ఇటీవల ఓ టీవీ ఛానెల్ విలేకరి కరాచీలో ఉన్న దావూద్ తో నేరుగా టెలిఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తొలుత ఫోన్ లో మాట్లాడిన దావూద్ ఇబ్రహీం ఆ వెంటనే ఫోన్ ను తన అనుచరుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడనే వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి చూస్తే.. మాఫియా డాన్ దావూద్ పాకిస్తాన్ లోని కరాచీలోనే ఉన్నాడనే అనుమానాలను కలిగిస్తున్నాయి.

పాకిస్తాన్ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ మాట్లాడుతూ.. ''దావూద్ పాకిస్తాన్‌లో ఉన్నాడని భారత్ చాలాకాలంగా ఆరోపిస్తూనే ఉంది. ఒకవేళ అతడు ఇక్కడే ఉన్నా... అతని విషయంలో మేం భారత్‌కి ఎందుకు సాయం చేయాలి?'' అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ''భారత్ ముస్లింలను చంపేస్తుంది. అందుకే దావూద్ భారత్ మీద పగతీర్చుకుంటున్నాడు..'' అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడంటూ గత పదేళ్లుగా భారత్ ఆరోపిస్తూనే ఉంది.
అల్ ఖాయిదా అధినేత బిన్ లాడెన్ విషయమే తీసుకుంటే.. అమెరికా రాత్రికి రాత్రే స్పెషల్ ఆపరేషన్ జరిపి పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో దాగి ఉన్న లాడెన్ ను అంతమొందించిన విషయం తెలిసిందే. బిన్ లాడెన్ మాదిరిగానే దావూద్ ఇబ్రహీంకు కూడా పాకిస్తాన్ ఆశ్రయం కల్పించి ఉంటుందనేది భారత్ వాదన.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!











Click it and Unblock the Notifications