తెలియకుండా కేజ్రీవాల్‌కు భద్రత, పాక్‌లో దావూద్: షిండే
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. అమెరికాతో కలిసి సంయుక్త ప్రయత్నంతో దావూద్‌ను పట్టుకుంటామని ఆయన చెప్పారు. తమకున్న సమాచారం మేరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు
నిరుడు అమెరికా వెళ్లినప్పుడు ఎఫ్‌బిఐ వ్యవహారాలు చూసే అటార్నీ జనరల్‌ను కలిశానని, తాను ఆయనతో మాట్లాడానని, దావూద్‌కు సంబంధించిన సమాచారం పరస్పరం మార్పిడి చేసుకోవాలని అనుకున్నామని షిండే చెప్పారు.

దావూద్ వంటి నేరస్థులను ఒకరి తర్వాత ఒకరిని తెచ్చే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అంతా అవుతుంది, చూస్తూ ఉండండని ఆయన అన్నారు.
మైనారిటీ యువకులను అరెస్టు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రులను ఆదేశించినట్లు షిండే తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన మైనారిటీ యువకులను వెంటనే విడుదల చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు.
పదే పదే తిరస్కరించినప్పటికీ తెలియకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సెక్యూరిటీ కవర్ కిందికి తెచ్చినట్లు షిండే తెలిపారు. ఇది ప్రభుత్వ విధి అని, భద్రతావసరాలను హోం మంత్రిత్వ శాఖ చూసుకోవాల్సి ఉంటుందని ఆయన ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఎంపిక కాగానే కేజ్రీవాల్‌కు భద్రత కల్పించామని, ఈ విషయం కెజ్రీవాల్‌కు తెలియదని ఆయన అన్నారు.
కేజ్రీవాల్ భద్రతపై మీడియా ప్రతినిధులు మూడు సార్లు ప్రశ్నించారు. జవాబు చెప్పడానికి రెండు సార్లు షిండే నిరాకరించారు. చివరికి మూడోసారి ఆ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications