టీవీలో కెబిసి చూస్తూ బిర్యానీ తింటుండగా దావూద్ సోదరుడు ఇక్బాల్ అరెస్ట్

టీవీలో కెబిసి చూస్తూ బిర్యానీ తింటుండగా దావూద్ సోదరుడు ఇక్బాల్‌ అరెస్ట్ చేసినట్టు థానే పోలీసుల ప్రకటనసోదరి హసీనా ఇంట్లో ఇక్బాల్ బస చేసిన విషయాన్ని పసిగట్టి అరెస్ట్ చేసిన పోలీసులుకస్టడీకి తీసుకొని వి

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కష్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆయన టీవిలో కెబిసి ప్రోగ్రాం చూస్తూ బిర్యానీ తింటున్నాడని పోలీసులు చెప్పారు. దావూద్ సోదరుడిని అరెస్ట్ చేసిన సమయంలో చోటుచేసుకొన్న ఘటనలను థానే సీపీ పరమ్‌వీర్‌సింగ్ చెప్పారు.

సోదరి హసీనా పార్కర్ ఇంటివద్ద కష్కర్ బసచేసినట్టు పసిగట్టిన పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో కష్కర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Dawood's Brother Was Watching KBC, Eating Biryani When Cops Picked Him Up

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదుతో అతడిపై పోలీసులు నిఘాపెట్టారు. ''ఇక్బాల్ కష్కర్ ఓ బిల్డర్ నుంచి నాలుగు ఫ్లాట్లతో పాటు రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. అతడిని అరెస్టు చేసి విచారించిన కొద్దీ మరికొంతమంమరికొంతమంది బిల్డర్లు, రాజకీయ నేతలను కూడా బెదిరించినట్టు ఫిర్యాదులు అందుతున్నాయి...'' అని సింగ్ వెల్లడించారు.

దావూద్ సోదరుడి అరెస్ట్‌ను పురస్కరించుకొని పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకొనే విచారించాలని భావిస్తున్నారు. ఇక్బాల్ విచారిస్తే దావూద్ విషయాలు మరిన్ని వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ పోలీసు అధికారుల్లో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+