Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Same Sex Marriage: స్వలింగ వివాహ చట్టబద్ధతపై సుప్రీంలో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం..

భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 9వ రోజు విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహ, హిమా కోహ్లీ విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తీరుతెన్నుల్లో ఎన్నో మార్పులొచ్చాయనే వాస్తవమని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందనే అంశంపై స్పృహ కలిగి ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

వివాహమనేది చట్టపరంగా లభించే గుర్తింపునకే పరిమితం కాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. సంప్రదాయాలను ఉల్లంఘించి చేసుకునే వివాహాలకు రాజ్యాంగం ప్రకారం హక్కులుండవనే వాదన సరికాదని పేర్కొంది. ఆర్టికల్‌ 14, 15, 17 ద్వారా రాజ్యాంగమే సంప్రదాయాలను బ్రేక్‌ చేసిందని జస్టిస్‌ భట్‌ అన్నారు. ఆర్టికల్‌ 14 ప్రకారం.. చట్టం ముందు అందరూ సమానమని చెప్పిన ఆయన.. ఆర్టికల్‌ 15 ప్రకారం.. మతం, జాతి, కులం, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా వివక్ష చూపడానికి వీల్లేదని స్పష్ట చేశారు

Day 9 of hearings on the legality of same-sex marriage in the Supreme Court

ఆర్టికల్‌ 17 ప్రకారం అంటరానితనం నిషేధం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే కదా అని అన్నారు. ఒకే లింగానికి చెందిన వ్యక్తులు భాగస్వాములుగా కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండటం భారతీయ కుటుంబ సంప్రదాయానికి మంచిది కాదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇదే విధమైన అభిప్రాయాలను ఇస్లామిక్ మత సంస్థ జమియాత్-ఉలమా-ఐ-హింద్ వ్యక్తం చేసింది. స్వలింగ వివాహం వంటి భావాలు పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉద్భవించాయని.. అవి రాడికల్ నాస్తిక ప్రపంచ దృక్పథాలను కలిగి ఉంటాయని పేర్కొంది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించింది. స్వలింగ వివాహ సమస్యను శాసనసభ పరిశీలనకు వదిలివేయాలని కోర్టును అభ్యర్థిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. బిసిఐ ప్రకటనను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సిబిఎ) ఖండించింది. ఈ పిటిషన్‌ను విచారించి కోర్టు తీర్పు ఇవ్వాలా లేదా పార్లమెంటు విజ్ఞతకే వదిలివేయడం సుప్రీం కోర్టు విధి అని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+