మంత్రితో గొడవ: మహిళా ఐపీఎస్‌పై వేటు, ఇది రెండోది

చండీగఢ్: హర్యానాలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఫతేబాద్‌ ఎస్పీ సంగీతా రాణి కాలియా పైన వేటు పడింది. మంత్రితో వాగ్వాదం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆమెను బదిలీ చేశారు. గతంలోను ఇలాంటి బదలీ మరో మహిళా అధికారిణి పైన పడింది.

హర్యానాలో గత రెండు నెలల్లో ఇలా అకస్మికంగా బదలీ అయిన రెండో మహిళా ఐపీఎస్ సంగీత రాణి. ఇంతకుముందు 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారిణి భారతి అరోరాకు తన సీనియర్‌తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో అప్రాధాన్య పోస్టుకు బదలీ చేశారు.

కాగా, మంత్రి అనిల్‌ విజ్ తీరు పైన విపక్షాలు మండిపడుతున్నాయి. 2010 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి అయిన సంగీతను, మరో ఇద్దరిని బదిలీ చేస్తున్నట్లుగా హర్యానా ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది.

Day after spat with mantri, woman IPS officer transferred

మంత్రి అనిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన అక్రమ మద్యం వ్యాపారం తీవ్రం కావడంపై ఎస్పీ సంగీతను ప్రశ్నించారు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఆయన బయటకు పొమ్మంటూ ఆవెుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే, ఆమె అందుకు నిరాకరించడంతో ఇద్దరి మాటామాటా పెరిగింది. చివరకు మంత్రి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనిల్‌ గతంలోనూ పలుమార్లు వివాదాలకు కారణమయ్యారు. తాజా పరిణామాలపై ఆయన మాట్లాడుతూ... అక్రమ మద్యం, మాదకద్రవ్యాల మాఫియాపై తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదుచేస్తే ఎస్పీ సంగీతా రాణి వారిపైనే విరుచుకుపడుతున్నారన్నారు.

మద్యం మాఫియాలో ప్రభుత్వం పాత్ర ఉందని ఆమె మీడియాకు చెబుతున్నారని, తనకేమీ ఆమెపై వ్యక్తిగత కోపం లేదని, అసమర్థులైన అధికారులపై తాను పోరాడుతున్నానని చెప్పారు. ఈ పోరాటం కొనసాగుతుందని మంత్రి చెప్పారు.

మరోవైపు మంత్రి, ఎస్పీల మద్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో రావడంతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని పూర్తి వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటానని హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+