ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య... ఆమె చనిపోయిన రెండు రోజులకే...

కేరళకు చెందిన సామాజిక కార్యకర్త,ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ఆత్మహత్యకు పాల్పడిన రెండు రోజులకే ఆమె భాగస్వామి జిజు రాజ్(36) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొచ్చిలోని ఓ స్నేహితుడి ఇంట్లో శుక్రవారం(జులై 24) మధ్యాహ్నం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అనన్య ఆత్మహత్యతో తీవ్ర మనస్తాపం చెందడం వల్లే జిజు రాజ్ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!!

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!!


బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య ఆత్మహత్యతో జిజు ఒంటరిగా ఫీలయ్యాడు. దీంతో కొచ్చిలోని ఓ స్నేహితుడి ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అదే ఇంట్లో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే అతను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు భావిస్తున్నారు. జిజు స్వస్థలం తిరువనంతపురం జిల్లా తైకవు గ్రామం.

అనన్య ఆత్మహత్యకు కారణమేంటి...

అనన్య ఆత్మహత్యకు కారణమేంటి...

అనన్య అలెక్స్ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. లింగమార్పిడి సర్జరీ ఫెయిల్ అవడమే ఆమె ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సర్జరీ ఫెయిల్ అయిందని... తన ప్రైవేట్ పార్ట్ ఒక మాంసం ముద్దలా తయారైందని ఓ ఇంటర్వ్యూలో అలెక్స్ పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పి కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నానని చెప్పారు. అలెక్స్ ఆత్మహత్యతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ,ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు సర్జరీ నిర్వహించిన ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించడంతో శాంతించారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనన్య నామినేషన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనన్య నామినేషన్

గతేడాది జూన్‌లో అనన్య అలెక్స్ లింగమార్పిడి సర్జరీ చేయించుకున్నారు. ఆ సర్జరీ విఫలమవడంతో రీసర్జరీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ ఆస్పత్రి వైద్యులు మాత్రం తమ పొరపాటేమీ లేదని వెల్లడించారు. తమవైపు నుంచి ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదన్నారు.ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇటీవలి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనన్య అలెక్స్ డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ తరుపున ఎన్నికల్లో నామినేషన్ వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే ఎన్నికలకు ఒకరోజు ముందు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నేతల నుంచే బెదిరింపులు ఎదురవతుండటంతో తాను పోటీ చేయట్లేదని... ఓటర్లు తనకు ఓటు వేయొద్దని చెప్పారు. అలా చివరి నిమిషంలో ఆమె ఎన్నికల నుంచి తప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+