కేజ్రీ సంచలనం: డీడీసీఏలో సెక్స్ రాకెట్ కూడా...!

న్యూఢిల్లీ: డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీడీసీఏ అధికారుల తీరుపై మంగళవారం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ సెలక్షన్స్ కోసం వెళ్లిన వారిపట్ల డీడీసీఏలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

క్రికెట్ సెలక్షన్‌లో భాగంగా తన కొడుకుని తీసుకుని డీడీసీఏ అధికారుల వద్దకు వెళ్లిన ఓ సీనియర్ జర్నలిస్ట్‌కు ఎదురైన చేదు అనుభవం తాజాగా తన దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.

'ఓ సీనియర్ జర్నలిస్టు నా వద్దకు వచ్చాడు. తన కుమారుని క్రికెట్ జట్టు సెలక్షన్ కోసం వెళితే అతని భార్యను ఒక నైట్ శారీరక సుఖం కోసం పంపమని ఓ డీడీసీఏ అధికారి అడిగాడట. తానే స్వయంగా ఈ విషయాన్ని నాతో మొరపెట్టుకున్నాడు' అని కేజ్రీవాల్ పేర్కొన్నాడు.

DDCA official sought sex for selection of cricketers, claims Kejriwal

'ఆ జర్నలిస్టు పేరును బయటకు చెప్పాలనుకోవడం లేదు. డీడీసీఏలో జరుగుతున్న అవతవకలకు ఇంతకన్నా నిదర్శనమేమిటి? అంటూ ప్రశ్నించారు. ఇదొక్కటే కాదు. ఈ తరహా ఘటనలు అక్కడ అనేకం' అని అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

డీడీసీఏలో అవినీతి, ఆర్ధిక అవకతవకలు అనేది ఒక కోణమైతే, అక్కడ సెక్స్ రాకెట్ లాంటివి జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికైనా డీడీసీఏలో అవినీతిపై విచారణను అడ్డుకోవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+