కరుణానిధి చనిపోయారంటూ వదంతులు: ఫిర్యాదు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన వందతులు ఇప్పుడు డీఎంకే చీఫ్ కరుణానిధివైపు మళ్లాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గుండెపోటుతో కరుణానిధి మృతి చెందినట్లు ఫేస్‌బుక్‌లో 'అమ్మా సింగం సవితా' ఐడీతో పోస్ట్ చేశారు. దీనికి నిసనగా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు ఆ ఫిర్యాదు స్వీకరించలేదని వాణియంబాడి డీఎంకే న్యాయవాదుల విభాగానికి చెందిన దేవకుమార్ చెబుతున్నారు.
ఇదిలా ఉండగా దేవకుమార్, సెంథిల్ వేలన్, దురైరాజ్ తదితరులు శనివారం వాణియంబాడి పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. కరుణానిధిపై వదంతులు సృష్టించిన సవితాపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టే వరకు అక్కడి నుంచి వెళ్లేదిలేదని భీష్మించారు. దీంతో పోలీసులు వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు.

అదేవిధంగా కరుణానిధిపై వదంతులు సృష్టించిన సవితాపై చర్యలు చేపట్టాలని అనైకట్టు డీఎంకే ఎమ్మెల్యే నందకుమార్, న్యాయవాదుల విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం వేలూరు ఎస్పీ కార్యాలయంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత నందకుమార్ మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నట్లు పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా కరుణానిధిపై వదంతులు సృష్టిస్తున్న వారిని కూడా అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications