నటుడి ఫాంహౌస్ స్విమ్మింగ్ పూల్‌లో కుళ్లిన శిశువు
ముంబై: బాలీవుడ్ నటుడు, టివి అర్టిస్ట్ మోహనీష్ భేల్‌కు చెందిన ఫాం హౌస్‌లో గల స్విమ్మింగ్ పూల్‌లో ఓ నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. విషయం తెలియడంతో ఖరేగాన్ ప్రాంతంలో గల తన ఫాంహౌస్‌కు మోహనీష్ వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఆ చిన్నారి మృతదేహాన్ని ఎవరు వేశారో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.
ఆ చిన్నారి బాడీ స్విమ్మింగ్ పూల్‌లోకి ఎలా వచ్చిందనే విషయం పోలీసులకు, నటుడు మోహనీష్‌లకు అంతుపట్టడం లేదు. ఆ శవం పూర్తిగా కుళ్లి పోయి ఉంది. పుట్టి నాలుగైదు రోజులకు ఎక్కువ అయి ఉండదని భావిస్తున్నారు.

పోలీసులు మాట్లాడుతూ.. విషయం తెలియగానే మోహనీష్ సంఘటన స్థలానికి వెంటనే వచ్చారని, తన స్విమ్మింగ్ పూల్‌లో నాలుగైదు రోజుల పసికందు మృతదేహాన్ని చూసి ఆయన అప్ సెట్ అయ్యారని తెలిపారు. అన్ని కోణాల్లోను కేసును దర్యాఫ్తు చేస్తామని చెప్పారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆ బాడీని ఎవరు వేశారో తెలుసునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications